ప్రస్తుతం చాలామంది ఎక్కువగా క్వర్డ్ డిస్ప్లే మొబైల్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.. ఇందుకోసం చాలా ఖరీదును పెడుతున్నారు యూజర్స్.. ఇలాంటి మొబైల్స్ కు ఖరీదైన ధర పెట్టాల్సిన పనిలేదు.. భారతీయ టెక్ కంపెనీలలో ఒకటైన లావా అతి చౌకైన ధరకే మార్కెట్లోకి క్వర్డ్ డిస్ప్లే తో కూడిన 5-G మొబైల్ని సైతం విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది.. ఈ స్మార్ట్ మొబైల్ కి సంబంధించి ఒక టీజర్ ని కూడా ఇటీవలే లావా ప్రెసిడెంట్ అయిన సునీల్ రైనా విడుదల చేశారు.


ఈ సమయంలోనే ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ విడుదల తేదీ స్పెసిఫికేషను కూడా రిలీజ్ చేశారు..lava blaze curve 5g మొబైల్ ఫిబ్రవరిలో ఈ ఏడాది విడుదల చేయబోతున్నారట వీటితో పాటు కంపెనీ ఈ స్మార్ట్ మొబైల్ ని నాలుగు కలర్లలో విడుదల చేయబోతున్నారు.. దీని ధర 15 వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకువస్తోంది. అది కూడా అమెజాన్ లో తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ని తెలుసుకుందాం..


Lava blaze curve -5G:
లావా బ్లెజ్ -5g మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే..6.78 అంగుళాలు కలదు ఇది పూర్తిగా HD+ డిస్ప్లే తో రాబోతోంది.. ఈ స్మార్ట్ మొబైల్ యొక్క డైమెన్షన్ 7050 ప్రాసెస్ తో పనిచేస్తుంది..8GB+128 స్టోరేజ్ ఆప్షన్లు ఈ మొబైల్ లాంచ్ కాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే..50 mp ప్రైమరీ కెమెరా కలదు. అలాగే అల్ట్రా వైట్ లెన్స్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ కలదు.. సెల్ఫీ ప్రియుల కోసం 8 mp కెమెరా కలదు.. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యంతో కలదు..18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు మరికొన్ని కొత్త ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: