ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ స్టోర్ లలో సంక్రాంతి ఆఫర్ నడుస్తోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఈ సంస్థలు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొన్ని స్మార్ట్ ఫోన్లపై ఏకంగా సగం ధర ఆఫర్ ప్రకటించడం గమనార్హం. వాటిలో పోకో స్మార్ట్ ఫోన్ కూడా ఒకటి.. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలు.. ధర.. ఫీచర్స్ విషయానికి వస్తే.. పోకో C55 4GB+64 GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.11,999 గా ఉండగా.. అయితే దీనిపై ఇప్పుడు 45% డిస్కౌంట్ లభిస్తోంది అంటే ఈ స్మార్ట్ ఫోన్ ని కేవలం రూ.6,499 కే లభిస్తోంది. అంతేకాదు దీనిపై అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల పై 10 శాతం తగ్గింపు లభించగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10% తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.71 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేని కలిగి ఉంటుంది.  కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాని అమర్చారు. సెల్ఫీ కెమెరా కూడా మంచి క్వాలిటీతో వస్తుందని సమాచారం. మీడియా టెక్ హీలియో G85 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇక 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.


ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ లేదు.. కానీ ఒక సంవత్సరం వారంటీ ఇతర యాక్సిసరిస్ పై ఆరు నెలల వారంటీ లభిస్తుంది. అంతేకాదు ఆర్డర్ చేసిన రెండు రోజుల్లోనే డెలివరీ అవుతుంది. ఇక సంక్రాంతి బొనాంజా గా ప్రకటించిన ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: