రోజు రోజుకి టెక్నాలజీ పరంగా అత్యాధునిక అందుబాటులోకి వెళ్తూనే ఉన్నాం.. సరికొత్త టూల్స్ తో పాటు స్మార్ట్ మొబైల్ కూడా సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఆ బాటలోనే ఎనర్జీ జైర్ బ్రాండ్ సంస్థ ఒక సరికొత్త మొబైల్ ని లాంచ్ చేయబోతోంది.. అవేనీర్ టెలికాం హార్డ్ కేస్..P-28 K మొబైల్ ని నిన్నటి రోజున బార్సిలోనా వేదికగా మొబైల్ వరల్డ్ లో ఆవిష్కరించారు.. ఈ మొబైల్ 28000 MAH బ్యాటరీ కెపాసిటీ తో లభిస్తుంది. రెగ్యులర్ గా మొబైల్ ఉపయోగించేవారు సింగిల్ చార్జింగ్తో వారం వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందట.


122 గంటల టాక్ టైం 90 రోజులపాటు స్టాండ్ బై బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది.. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.78 అంగుళాలు కలదు. కెమెరా సెట్ అప్ విషయానికి వస్తే..60 mp కెమెరాతోపాటు ప్రైమరీ సెన్సార్ కెమెరా..20 MP..2MP కెమెరా కలదు సెల్ఫీ వీడియో కాల్స్ కోసం..16 mp కెమెరా కలదు.. అలాగే వీడియో రికార్డింగ్లో 4K క్వాలిటీ కూడా కలిగి ఉంటుందట.


4జి ఎల్జిటి కనెక్టివిటీ గల ఈ మొబైల్ 3 ఇయర్స్ వారంటీతో లభిస్తుంది..ఎనర్జీజైర్ హార్డ్ కెస్ P-28K స్మార్ట్ మొబైల్ వచ్చే అక్టోబర్ నెలలో అన్నిచోట్ల ప్రారంభం చేస్తారట. ఈ మొబైల్ ద్వారా విషయానికి వస్తే ఇండియాలో 22 వేల రూపాయలు..(250 యూరోలు..) 2018లో 16 వేల MAH బ్యాటరీ కెపాసిటీ గల మొబైల్ ని కూడా విడుదల చేశారు అలాగే 2019లో..ఎనర్జీ జైర్ P-18 పాప్ మొబైల్స్ ను కూడా ఆవిష్కరించారు.. ఈసారి 2024లో సరికొత్త మొబైల్ తో పాటు అత్యధికంగా బ్యాటరీ కలిగి ఉన్న మొబైల్ ని లాంచ్ చేశారు.. మరి ఈ మొబైల్ కస్టమర్లను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: