ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు.. ప్రతి రోజు ఏదో ఒక చోట.. ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంటాయి. అలాంటి అద్భుతాలను మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పేటువంటి కొన్ని వాస్తవాలను చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు .. అయితే మరెందుకు ఆలస్యం..వాటి గురించి తెలుసుకుందాం.

1). ఉడుతలు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉంటాయి. కానీ వీటి గురించి మనకు తెలియని విషయం ఏమిటంటే.. భూమి పైన కొన్ని కోట్ల చెట్లు ఉంటాయి. అలాంటి కొన్ని కోట్ల చెట్లల్లో,  కొన్ని లక్షల చెట్లు ఉడుతల వల్లే పుట్టి ఉంటాయట. అది ఎలా అంటే.. ఇవి ఎక్కడైనా చెట్లమీద ఉండేటువంటి గింజలను, కాయలను మళ్ళీ తినడం కోసం  ఇతరులకు కనిపించకుండా భూమి లోపల దాచి పెట్టుకుంటూ వెళ్తాయి. అలా దాచిపెట్టిన వాటిని మరచిపోయి ఒక్కోసారి ఆ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లినప్పుడు అవి మొక్కలుగా, చెట్లగా ఉద్భవిస్తాయి.

2). ఒక్కోసారి మైక్రో ఓవెన్ లోపల గుడ్లు  పెట్టినప్పుడు అవి  పగిలి పోతుంటాయి. అలా పగిలి పోవడానికి కారణం ఏమిటంటే.. ఆ మైక్రోఓవెన్ లో ఉండే గాలి వల్ల  గుడ్డు పేలుతుంది.

3). అప్పట్లో ఈజిప్ట్ మనుషుల యొక్క ఆచారాలు, పద్ధతులు చాలా విచిత్రంగా ఉండేవి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వారి యొక్క టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉండేది. ఇక ఈజిప్టులో ఉండే కొంతమంది పూజారులు కొన్ని విచిత్రమైన అలవాట్లను పాటించేవారు.. అదేమిటంటే , ఆ రాజ్యంలో ఎవరైనా రాజులు చనిపోతే, వారికి  పూజలు చేసి, మమ్మీ లు గా మార్చడం వంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ పూజారులు తమ ఒంటి మీద ఒక్క వెంట్రుక కూడా ఉండకుండా చేతితోనే తీసేసేవారట.

4). మనం స్నానం చేసిన తర్వాత చెవిలో ఏదైనా మురికి ఉంటే  ఎయిర్ బడ్ తో క్లీన్ చేస్తూ ఉంటాము. అయితే జిరాఫీలు మాత్రం తమ చెవులను క్లీన్ చేసుకోవాలంటే.. తమ నాలుకలతోనే చేసుకుంటాడట. జిరాఫీ నాలుక పొడవు 21 ఇంచులు ఉంటుంది.

5).  మన ఇళ్లల్లో ఎలుకలు ఉన్నప్పుడు ఎక్కువగా  పిల్లిలను పెంచుతూ ఉంటాము. అయితే ఆ పిల్లిలు తమ జీవిత కాలంలో 70 % నిద్రించడానికి సమయాన్ని కేటాయిస్తాయట.

6). మన చుట్టూ పరిసరాలలో కొన్ని పక్షులు తిరుగుతూ ఉంటాయి. అలాంటి పక్షులలో సాంగ్ బర్డ్ పక్షి కూడా ఒకటి. ఇది రోజుకు 2000 సార్లు పాటలు పాడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: