బాహుబలి సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకేసారి మూడు బాణాలు వేసి ఒక్క దెబ్బకి ముగ్గురిని చంపేస్తే అది చూసిన ప్రేక్షకులు అందరూ వావ్ అంటూ చప్పట్లు కొట్టేశారు.. ఇక గుర్రం మీద స్వారీ చేస్తూ వేగంగా బాణాలు విసురుతు  విన్యాసాలు చేస్తే చూసి ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. సినిమాల్లో ఇలాంటివి చేయడానికి ఎన్నో జాగ్రత్తలు  తీసుకుంటూ ఉంటారు. కానీ నిజజీవితంలో ఇలాంటివి చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఇలాంటి విలువిద్య  ఇప్పటినుంచి కాదు మన పూర్వీకుల నుంచి వస్తుంది. పురాణాల్లో చూసుకున్న కూడా ఒకప్పుడు విలువిద్య లాంటివి ఉండేవి అన్నది తెలుస్తుంది.

 అయితే ప్రాచీనకాలం నాటి విలువిద్యను అపోసనా పట్టాడు ఇక్కడ ఓ ఆంధ్ర యువకుడు. ఈ క్రమంలోనే ఇక విలువిద్యలో రాటుదేలి పోయాడు. ఇక ఇటీవల అతనికి  సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. పూర్వీకుల నుంచి వచ్చిన విలువిద్య అంతరించిపో కూడదు అని నడుంబిగించాడు ఇక్కడ ఒక యువకుడు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన ఉదయ్ కుమార్కు చిన్నతనం నుంచే విలువిద్య పై ఎంతో మక్కువ. అయితే మాట్లాడినంత  అంత సులభం కాదు ధనుర్విద్య నేర్చుకోవడం. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ధనుర్విద్య పై మక్కువ చూపుతూ నేర్చుకున్నాడు.


 ధనుర్విద్య నేర్చుకోవడానికి తన 15వ ఏట చెన్నైలోని ఒక ట్రైనింగ్ సెంటర్ లో చేరాడు. ఇక ఆ తర్వాత తండ్రి అకాల మరణం తీవ్ర మనోవేదనకు గురి చేసిన తనకు నచ్చిన విద్యను మాత్రం విడిచిపెట్టలేదు  ఇక ధనుర్విద్యలో ఉన్న అన్ని రకాలను నేర్చుకుని ప్రస్తుతం ఒక గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. ఒకేసారి రెండు బాణాలు సంధించడం.. ప్రాచీన యుద్ధాల్లో మాదిరిగా గుర్రంపై వేగంగా వెళుతున్న సమయంలో కూడా గురి చూసి బాణాలు వేయడంలో దిట్టగా మారిపోయాడు. బాహుబలి కాదు అంతకు మించిన టాలెంట్ని చూపిస్తున్నాడు. ఇక తన విద్యను పదిమందికి పెంచేందుకు ఆర్చరీ  ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రారంభించాడు ఉదయ్ కుమార్ ఇక ఇతని టాలెంట్ కు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: