మాములుగా చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ను ఏదొక సందర్భంలో అతిక్రమిస్తారు..అయితే అలాంటి వారికి పోలీసులు వారి స్తైల్లొ బుద్ది చెప్పినా కూడా వాళ్ళు మారరు.ఎవరి తీరు వాల్లదె అన్నట్లు వాళ్ళు అనుకున్నదే చేస్తారు.ఇక్కడ చాలామంది ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను అర్ధం చేసుకోవడానికి గానీ, వాటిని పాటించడానికి గానీ సిద్ధంగా లేరనే విషయం చాలా సందర్భాల్లో వెల్లడైంది.ఇక దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ నేపథ్యంలో దేశ వాణిజ్య రాజధాని ముంబైకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకే బండి పై ఆరు మంది ప్రయాణం చేస్తూ రోడ్ల మీద వెళ్లేవారికి షాక్ ఇస్తున్నారు.


మోటార్ సైకిల్ పై ప్రయాణించడానికి కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఈ నియమాలు ప్రకారం.. ద్విచక్ర వాహనం నడిపే డ్రైవర్ అదనంగా మరొక వ్యక్తి మాత్రమే కూర్చోవాలి. మొత్తానికి మోటార్ సైకిల్ పై గరిష్టంగా ఇద్దరు మాత్రమే కూర్చునే అనుమతి ఉంది. అయితే రోజూ మోటార్ బైక్ పై దాదాపు ముగ్గురు వ్యక్తులు కూర్చుని ప్రయాణించడం మనం చూస్తూనే ఉన్నాం.. ఇక కొన్ని అరుదైన సందర్భాల్లో ఏకంగా నలుగురు కూడా ప్రయాణిస్తుంటారు..అయితే ఒక దానిపై 6 మంది ఎలా ప్రయాణం చేస్తారు.2, లేదా 3 వెళ్ళడానికి కష్టం అవుతుంది కదా అనే సందెహాలు చాలా మందికి వస్తుంటాయి.



ముంబైలోని హోండా యాక్టివాపై ఆరుగురు ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రైడర్ సహా ఐదుగురు వ్యక్తులు రైడింగ్ చేస్తున్న ఈ వీడియో చాలా చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో రెడ్ లైట్ వద్ద ట్రాఫిక్ ఆగి ఉంది. ఈ సందర్భంలో ఒకే స్కూటర్‌పై మొత్తం 6 మంది యువకులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అతడిని ఎవరో వీడియో తీశారు. హోండా యాక్టివాపై వెళ్తున్న 6 మందిలో 5 మంది యాక్టివా సీటుపై ఒకరినొకరు హత్తుకుని కూర్చున్నాడు. అయితే ఆరోబాలుడు.. మాత్రం.. స్కూటర్ వెనుక కూర్చుకున్న ఐదో వ్యక్తి.. భుజంమీదకు ఎక్కి.. కూర్చున్నాడు. ఆరోవ్యక్తి అటువంటి భయం లేకుండా మరో వ్యక్తి భుజంపై స్వారీ చేయడం వీడియోలో చూడవచ్చు..ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లో వైరల్ అయ్యింది..మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: