టీ తాగిన తర్వాత టీ బ్యాగ్ లను పడేయ్యటం మనం చూస్తూనే ఉంటాము. వాటి వల్ల కూడా ఎన్నో ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. వాటితో అందాన్ని మెరుగు పరుచుకోవచ్చు.. అలాగే జుట్టు పెరుగుదల కూడా ఉంటుంది.. కొన్ని వస్తువులను  శుభ్రం చెయ్యడం కోసం వాడతారు.. అంతే కానీ వీటిని మళ్ళీ తిరిగి అమ్మకొరు.. అస్సలు అలాంటి వాటిని కొనరు కూడా..ఆగండి ఇక్కడే పప్పులో కాలు వేశారు. ఇప్పుడు ఓ టీ బ్యాగ్ ను విక్రయించినందుకు ఏకంగా లక్షలు పోశారు.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ టీ బ్యాగ్ అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
 

ఈ నెల 8వ తేదీన చనిపోయిన మహారాణి ఎలిజబెత్ చనిపోయాక కూడా తన స్టామినాను నిరూపించుకున్నారు. ఆమె తాగి పడేసిన టీ బ్యాగ్ వేలం లో ఏకంగా రూ. 9.5 లక్షలకు అమ్ముడుపోయింది.. డాలర్లలో చెప్పాలంటే 12 వేల డాలర్లు. ఆ టీ బ్యాగ్ కూడా ఈ మధ్యన వాడింది కాదు. దాదాపు పాతికేళ్ల కింద 1998 లో ఆ టీ బ్యాగ్‌ను ఎలిజబెత్ వాడుకున్నారు. ఈ టీ బ్యాగ్‌కు రాయల్ ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఉంది..


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికెట్స్ ఇచ్చిన సర్టిఫికెట్ దీనికి జోడించారు. అమెరికా లోని జార్జియా లో నివసించే ఓ వ్యక్తి ఈ టీ బ్యాగుని విండ్సర్ ప్యాలస్ నుంచి చేజిక్కించుకొని ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టాడు. ఇంత ధర రావడం చూసి షాక్ తిన్నాడు. ఇదే కాక, ఎలిజబెత్ మైనపు విగ్రహాన్ని అమ్మకాని కి పెట్టగా, 15,900 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 12.60 లక్షలు పలికింది. ఇంత ధర పలకడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు... నేడు ఆమె అంత్యక్రియలు ఘనంగా జరగనున్నాయి.. భారీ సంఖ్యలో ఆమె అభిమానులు,ప్రముఖులు హాజరుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: