ఒకప్పుడైతే అడవుల్లోకి వెళ్లి జంతువులను నేరుగా చూసేందుకు చాలా మంది భయపడేవారు. కానీ ఇటీవల కాలంలో ఇలా ఏకంగా అడవుల్లోకి వెళ్లి జంతువులను దగ్గరనుంచి చూడటం ఒక సరదాగా మారిపోయింది. దీంతో ఎంతో మంది పర్యటకులు సఫారీ వాహనాలు అడవుల్లోకి వెళ్లి ఇక క్రూరమైన జంతువుల దగ్గర నుంచి సాదు జంతువుల వరకు అన్నింటినీ కూడా దగ్గర నుంచి చూస్తూ ఫోటోలు వీడియోలు తీయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అవి తెగ వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే పర్యటకుల లాగా అడవుల్లోకి వెళ్లి అవకాశం లేనివారు ఇక సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే వీడియోలు చూసి ఆశ్చర్యపోతున్నారు.



 అయితే ఇలా అడవుల్లోకి జంతువులను చూసేందుకు వెళ్తున్నా కొంతమంది పర్యటకులు మాత్రం కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అడవుల్లో ఉండే జంతువులకు సైతం పర్సనల్ లైఫ్ ఉంటుందని దానిని డిస్టర్బ్ చేస్తే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని విషయాన్ని మరిచిపోతున్నారు. దీంతో కొన్ని కొన్ని సార్లు పర్యటకుల అత్యుత్సాహం ఏకంగా వారి ప్రాణాల మీదకే తెస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోని ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ఇక తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక వీడియోని పంచుకున్నారు.



 సఫారీ వాహనంలో ఏనుగును చూసి ఎవరైనా భయపడితే.. వారు ఎందుకు అడవిలోకి వెళ్లి అంత బిగ్గరగా అరుస్తారు. జంగిల్ సఫారీలలో మనుషులుగా ప్రవర్తించండి. హుందాగా వినయంగా ఉండండి అంటూ ఆయన ఒక కామెంట్ రాసుకొచ్చారు. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. సఫారీ జీప్ పై ప్రయాణిస్తున్న పర్యటకుల బృందం వెళ్తుండగా.. ఒక ఏనుగు వారికి ముఖాముఖి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఏనుగు వారి వాహనాన్ని వెంబడించిన తర్వాత పర్యటకులు భయంతో కేకలు వేయడంతో చివరికి ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: