తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్... డిసెంబర్ 20 న ఎంతో అట్టహాసంగా ముగిసింది. ఇంటి సభ్యులు పెద్ద సెలబ్రిటీలు కాకపోయినప్పటికీ.... ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక ఇంటి సభ్యుడు బిగ్ సెలబ్రిటీ గా మారిపోయారు. సీజన్ 4 విజేతగా నిలిచిన అభిజిత్ ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు.. ప్రేక్షక అభిమానులు ఎంతో ప్రేమతో అభిజిత్ కు ఓట్లు వేసి గెలిపించుకున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ఎనలేని క్రేజ్ ని సంపాదించుకున్నాడు అభిజిత్. మరోవైపు టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచిన సోహెల్ మంచి గుర్తింపు అందుకున్నాడు. తన పెర్ఫామెన్స్తో, స్లాంగ్.... ఖచ్చితత్వం అయిన మాటలు, స్నేహానికి తన ఇచ్చే విలువ, రియాలిటీ డైలాగ్స్ తో ఆకట్టుకున్న సోహెల్ కు మెగాస్టార్ కూడా ఫిదా అయ్యారు.

అంతకంటే పెద్ద విషయం ఏంటంటే... పీక్స్ లో తను డెసిషన్ తీసుకొని గెలుచుకున్న 25 లక్షల భారీ మొత్తం నుంచి... కొంత తన ఫ్రెండ్ మెహబూబ్ కి, అలాగే మరికొంత అనాధ ఆశ్రమానికి ఇస్తాను అనడంతో... ప్రజల మనసు కు మరింత దగ్గరయ్యాడు సోహెల్. అక్కడున్న వారందరికీ ఎమోషనల్ గా చేరువయ్యాడు. దాంతో చిరంజీవి, నాగ్ లు సోహెల్ ను మెచ్చుకుంటూ అతనికి బదులు ఆ మొత్తాన్ని వారే ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు తను త్వరలో చేయాలనుకుంటున్న సినిమాకి మెగాస్టార్ చిరంజీవిని మరియు అక్కినేని నాగార్జున ఇద్దరినీ తన చిత్ర ప్రమోషన్ కి సహాయం చేయాలంటూ గ్రాండ్ ఫినాలే స్టేజిపై కోరగా.... తప్పకుండా చేస్తామంటూ మాటిచ్చారు చిరు మరియు నాగ్ లు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది.

మరి ఇప్పుడు సోహెల్ కోసం కామెడీ కింగ్ బ్రహ్మానందం సైతం ఎటువంటి రెమ్యునరేషన్ ఆశించకుండా సోహెల్ చేసే సినిమాలో నటించడానికి ముందుకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కథ వేరేలా ఉంటుంది... కథ వేరేలా ఉంటుంది.... అంటూ నిజంగానే బిగ్ బాస్ షో ద్వారా తన లైఫ్ కథను పూర్తిగా మార్చుకున్నారు సోహెల్. ఇదంతా బిగ్ బాస్ ఇచ్చిన అవకాశమే అంటూ సోహెల్ తెగ సంబరపడిపోతున్నాడు. కాగా త్వరలోనే సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన జీవితంలో ఎప్పటికీ బిగ్ బాస్ ని మరిచిపోనని ఈ సందర్భంగా తెలియచేసాడు. అందరూ మెచ్చుకునేలా మంచి సినిమా తీసి అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాటిచ్చాడు సోహెల్... 

మరింత సమాచారం తెలుసుకోండి: