పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయం వద్ద పొగబెట్టి కార్యక్రమాన్ని శ్రీధర్ బాబు ప్రారంభించారు తెలంగాణ వాసి రమేష్. ఈయన గోశాల నిర్వాహకుడు.అక్కడ గోశాలలోని ఆవుల పేడను సేకరించి, నెయ్యి,పసుపు,ఆవాలు,కర్పూరం వంటివి అందులో వేసి కాల్చడం ద్వారా వచ్చే పొగతో కరోనా వైరస్ అంతం కావడంతోపాటు గాలిలో మంచి ప్రాణవాయువు పెరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు రెండు గంటలపాటు ఇలా పెడితే ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళల్లో ఇలా చేస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు. ఈ వింత ప్రయోగం బాగుందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గోశాల నిర్వాహకులను అభినందించారు. ప్రస్తుతం కరోనాతో సతమతమవుతున్న సమయంలో ఎవరు ఏం చెప్పినా నమ్మి తీరాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో శాస్త్రవేత్తలే తేల్చి చెప్పాలి మరి..