కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో ఏ వార్త వచ్చినా వదలకుండా చదువుతూ ఇతరులకు షేర్ చేస్తుంటారు కొంతమంది.... కానీ ఇందులో ఎంత నిజముందో ఎంత అబద్ధం ఉందో గ్రహించలేకపోతున్నారు... ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఫేక్ న్యూస్ ఒకటి వైరల్ అయింది. కరోనా వైరస్ పాజిటివ్ వస్తే అటువంటి వారికి ప్రభుత్వం కోవిడ్ 19 పేరుపై ఒకటిన్నర లక్ష వరకు డబ్బులు ఇస్తుందన్న వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అయితే దీనిపై స్పందించిన పి.ఐ.బి (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యురో) ప్రజలకు ఓ క్లారిటి ఇచ్చింది..... సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న రూ1.5 లక్షలు అన్న విషయం తప్పంటూ... అటువంటి ఏ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని, కాబట్టి కరోనా పేషెంట్ లకు ఎలాంటి డబ్బులు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.
అంతే కాదు ఇది కేవలం సోషల్ మీడియాలో మాత్రమే వైరల్ అవుతోంది తప్ప అఫీషియల్ గా ఎక్కడా ఇటువంటి న్యూస్ ప్రకటించలేదని తెలిపింది. ఇటువంటి ప్రధానమైన విషయాలను ఖచ్చితంగా ప్రభుత్వం వారు తగిన ప్రచార కార్యక్రమాల ద్వారా మరియు ప్రభుత్వ సచివాలయాల సిబ్బంది ద్వారా మీకు తెలియచేస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి