నిజంగా వీళ్ళిద్దరూ కలిసి మల్టీ స్టారర్ చేసినంత సంతోషపడిపోయారు అభిమానులు. సరే ఈ విషాయాన్ని పక్కన పెట్టేసి అసలు మ్యాటర్ లోకి వద్దాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ చిత్రంతోనూ అలాగే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంతోనూ బిజీగా గడుపుతున్నారు. ఈ ఇద్దరి హీరోలు ఇప్పుడు కొత్త లుక్ లోకి మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ గుబురు గడ్డంతోనూ ఒత్తైన జుట్టుతోనూ కనిపిస్తూ వచ్చాడు.
అయితే ఇప్పుడు కొత్త లుక్ లోకి మారి ‘వకీల్ సాబ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక మహేష్ బాబు కూడా లాంగ్ హెయిర్ పెంచి కొత్త లుక్ లోకి మారాడు. ఈ లుక్ లో మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. పవన్ – మహేష్ ల కొత్త లుక్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి