ముత్తు కుమార్ సెప్టెంబర్ నెలలో తమ స్కూల్ ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ తన స్కూల్ ఫ్రెండ్ కె.నాగేంద్రన్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ముత్తు కుమార్ నాగేంద్రన్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు. ముత్తు ఇంటిని చూసిన నాగేంద్రన్‌కు గుండె పగిలినంత పనైంది. దీంతో ముత్తుకు సాయం చేయాలని నాగేంద్రన్ నిర్ణయించుకున్నాడు. ఆ ఇంటి ఫొటోలు తీసి తమ స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీంతో మిగతా స్నేహితులు సైతం ముత్తుకు సాయం చేయడానికి ముందుకొచ్చారు.
స్నేహితుల నుంచి సేకరించిన 1.5 లక్షలతో కేవలం మూడు నెలల్లోనే ఇల్లు కట్టి ముత్తూకు ఇచ్చారు. ఇందులో చిత్రమైన విషయం ఏమిటంటే.. ముత్తు స్నేహితులు ఇంజినీర్ల సాయం లేకుండానే స్వయంగా ఆ ఇల్లు నిర్మించారు. దీపావళి కానుకగా ఆ ఇంటిని ముత్తుకు అందించారు. ఆ ఇంటికి సమీపంలోనే ముత్తు తల్లి కోసం ప్రత్యేకంగా ఒక గుడిసె కూడా నిర్మించారు.నిజంగా వీళ్ళు స్నేహానికి విలువనిచ్చి కష్టాల్లో వున్న స్నేహితునికి అండగా నిలిచినందుకు చాలా మంది మెచ్చుకుంటున్నారు. స్నేహమంటే ఇదేరా అంటూ వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి