ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... 144 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలితే ఎలా ఉంటుంది..ఎంత భయంకరంగా  ఉంటుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. సెకన్ల వ్యవధిలోనే అంత ఎత్తైన భవనం చూస్తుండగానే నేలమట్టమై కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ  వైరల్‌గా అవుతుంది.



ఇక అరబ్బుల దేశంలో కట్టడాలు ఎలాఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కట్టడాలలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. అబు ధాబీలో 144 అంతస్తుల మీనా ప్లాజా ను కూల్చేయాలని అక్కడి అధికారులు నిర్ణయించుకున్నారట. 165 మీటర్ల ఎత్తైన ఈ 144 అంతస్తుల భవనాన్ని కూల్చాలంటే కొన్నేళ్లు పడుతుంది. ఈ సందర్భంగా అధికారులు సాహసోపేత నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంత పెద్ద అంతస్తును డిటోనేటర్లతో పేల్చి కూల్చేందుకు ఏర్పాట్లు చేశారు.



ప్లాన్ ప్రకారమే నాలుగు టవర్లకు మొత్తం ఆరు వేల కిలోల ప్లాస్టిక్ ఎక్స్‌ప్లోజివ్‌లను భవనం పిల్లర్లకు అమర్చారట. తరువాత  ఆ భవనం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించి పేల్చేశారు. దీంతో పది సెకన్ల వ్యవధిలోనే భవనం కుప్పకూలింది. మీనా ప్లాజాగా పేరొందిన.. మినా జాయెద్‌ భవనాన్ని 1972లో అబుదాబీ పోర్టులో ప్రారంభించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: