ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఆ బాలుడి తండ్రి జైలు పాలయ్యాడు. తల్లి అతన్ని వదిలేసింది. ఇక రోడ్డున పడ్డాడు బాలుడు. అతనికి తోడుగా మిగిలి వుంది అతని పెంపుడు కుక్క మాత్రమే. ఆ కుక్కని తీసుకోని బయటకి వచ్చేశాడు. ఒక రోడ్డుపై తన కుక్కతో నిద్రిస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందరిని కంట తడి పెట్టిస్తుంది.. ఇక వివరాల్లోకి వెళితే.. ఆ బాలుడి పేరు అంకిత్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఉంటున్నాడు. ఓ నేరంలో తండ్రి జైలుపాలు కావడంతో తల్లి ఆ బాలుడిని పట్టించుకోవడం మానేసింది. ఇంటి నుంచి బయటకు పంపేయడంతో.. దిక్కుతోచని స్థితిలో అతడు ఫుట్‌పాత్‌నే ఆశ్రయంగా మార్చుకున్నాడు.

తనతో తోడుగా వచ్చిన పెంపుడు కుక్క డ్యానీతో తన కష్టాన్ని పంచుకున్నాడు. డ్యానీ కూడా ఏ రోజు అంకిత్‌ను విడిచిపెట్టలేదు. అంకిత్ గురించి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అంకిత్ తన కడుపు నింపుకోడానికి బెలూన్లు అమ్మెవాడట. కొన్ని రోజులు ఓ టీస్టాల్‌లో కూడా పనిచేశాడు. రాత్రివేళల్లో ఫుట్‌పాత్ పక్కన ఉన్న ఓ దుకాణం వద్ద తన కుక్కతో కలిసి నిద్రపోయేవాడు. ఇటీవల కొందరు చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటో చూసిన ముజఫర్ నగర్  పోలీసులు అంకిత్‌ను ఆదుకోడానికి ముందుకొచ్చారు.



 ఎస్ఎస్‌పీ అభిషేక్ యాదవ్ ఆ బాలుడి ఆచూకీ తెలుసుకోడానికి ప్రయత్నించారు.ఎట్టకేలకు పోలీసులు  అంకిత్ ఆచూకీ తెలుసుకున్నారు. ఇక  అంకిత్ పనిచేసిన టీస్టాల్ యజమాని మాట్లాడుతూ.. ‘‘అంకిత్ కొద్ది రోజులు తమ వద్ద పనిచేశాడు. అతడు పనిచేస్తునంత సేపు డ్యానీ షాపులో ఓ మూల కూర్చోని ఎదురు చూస్తుండేది. అకింత్‌కు ఆత్మగౌరవం ఎక్కువ. ఏదీ ఉచితంగా తీసుకొనేవాడు కాదు. ఆఖరికి తన కుక్కకు పోసే పాలకు కూడా డబ్బులు చెల్లించేవాడు’’ అని తెలిపాడు.అంకిత్ ఇప్పుడు ముజఫర్‌నగర్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. పోలీసులు అతడి బంధువులను వెతికే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా అంకిత్ ఫొటోలను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపారు.

బాలుడిని ఆదుకోవాలని కోరుతూ జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం అంకిత్ శివలీలా అనే మహిళ వద్ద ఉంటున్నాడు. అంకిత్ బంధువుల ఆచూకీ తెలిసే వరకు ఆమె వద్దే ఉంటాడని పోలీసులు తెలిపారు. అప్పటివరకు అతడికి చదువు చెప్పేందుకు స్థానిక ప్రైవేట్ స్కూల్ కూడా ముందుకొచ్చిందని తెలిపారు.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: