తమిళనాడు,మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కరోనా కఠిన నిబందనలను పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా స్ట్రెయిన్ ఆంధ్రప్రదేశ్ ను కూడా తాకిందని సమాచారం. యూకే నుంచి ఏపీకి వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. బాధితులను కొవిడ్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరికి, గుంటూరులో ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్టు తెలిపారు. అయితే వీరికి ఉన్నది కరోనా ట్రెయిన్ అనే అనుమానంతో వీరి శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపామని, రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ప్రజలు ఈ కొత్త వైరస్ గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు వైద్యులు.అయితే ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి