సాధారణంగా కోతి రూపం నుంచి మానవ పుట్టుక వచ్చింది అని చెప్పడంతో కోతులు చింపాంజీలకు, మనుషుల పోలికలకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి.మనుషులు చేసే ప్రతి పనిని చింపాంజీలు కూడా ఎంతో అవలీలగా చేస్తాయి. ఇక్కడ ఓ చింపాంజీ కూడా అచ్చం చిన్న పిల్లల చేష్టలను చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.
సాధారణంగా చిన్న పిల్లలకు ఐస్ క్రీమ్స్ అంటే ఎంతో ఇష్టం. ఐస్ క్రీమ్ కనిపిస్తేచాలు వాటిని కొనివ్వాలని ఎంతో మారాం చేస్తుంటారు.ఒకసారి ఐస్ క్రీమ్ కొనిస్తే వారి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఐస్క్రీమ్ ని ఎంతో ఇష్టంగా తింటూ ఉండడం మనకు నవ్వు తెప్పిస్తుంది. అచ్చం ఈ చింపాంజీ కూడా చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ తినే విధంగా ఐస్ క్రీమ్ తింటూ, చప్పరిస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఎంతగానో నవ్వు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం చింపాంజీ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నటువంటి ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లు ఆకట్టుకుంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి