వేసవి వచ్చిందంటే చాలు మండే ఎండలు పక్కన పెడితే నోరూరించే మామిడి దర్శనమిస్తుంది. ఎన్నో రకాల మామిడి పండ్లు మన భారత దేశం లో సాగు చేయబడుతున్నాయి. వాటిని రుచిని బట్టి డిమాండ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. మహా అయితే వెయ్యి, రెండు వేలు ఉంటె చాలా మంది ఆశ్చర్యపోతారు. అంతగా ఆ మామిడిలో ఏముంది.. అంటూ కొత్త కథలకు తెరలేపుతారు. అలాంటి ఒక అరుదైన మామిడి కాయల రేటు అక్షరాలా రెండు లక్షలు..

ఏంటి రెండు లక్షలా.. అని ఆశ్చర్యపోకండి .. మీరు విన్నది నిజమే.. ఆ అరుదైన జాతి మామిడి రేటు ఎక్కువే.. ఇంత రేటు ఉన్న మామిడికి రక్షణ కూడా ఎక్కువే. మాములుగా అయితే మామిడి తోటకు ఒకరో, లేదా ఇద్దరో ఉంటారు. మామిడి పండ్లను దొంగలించకుండా కాపాడుతారు. కానీ, ఈ అరుదైన మామిడికి నలుగురు వ్యక్తులు, ఆరు శునకాలతో కాపలా కాస్తున్నారు. ఇంత భద్రత ఎందుకంటారా? ఆ రకం మామిడి పండ్లకు పసిడికన్నా ఎక్కువ డిమాండ్ ఉంది.

ఈ ఖరీదైన మామిడి మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. రాష్ట్రంలోని జబల్‌పూర్‌కు చెందిన రాణి, సంకల్ప్‌ దంపతుల తోటలో ఈ చెట్లున్నాయి. ఇవి జపాన్‌లోని మియాజాకి ప్రాంతానికి చెందిన అరుదైన రకానికి చెందిన మామిడి. అందుకే వీటికి మిజయాకి అనే పేరు కూడా ఉందని అంటున్నారు. ఈ పండ్లు చూడటానికి రూబీ కలర్ లో ఉంటాయి. ఒక్కో కాయ 350 గ్రాముల  బరువు ఉంటుంది. కిలో ఈ మామిడి పండ్ల ధర 2. 7 లక్షలు. గత సంవత్సరం మార్కెట్లో వివిధ రకాల మామిడి కిలోకు రూ .2.70 లక్షలకు అమ్ముడైందని అంటున్నారు. ముంబైకి ఓ వ్యక్తి ఈ పండ్లను పెంచుతున్నందుకు 21 వేలు ఇచ్చారని మామిడి యజమాని అన్నారు. ప్రస్తుతం ఈ కాస్ట్లీ పండ్లకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: