జాతీయ జెండా.. దేశానికి ప్రతిరూపం ఈ జెండా. ప్రతి ఒక్కరూ ఆయా దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలను ఎంతో పవిత్రంగా , ప్రాధాన్యత తో రూపొందించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తమ దేశాలు జాతీయ చిహ్నంగా పెట్టుకునే జెండాను అత్యంత పవిత్రంగా భావించడమే కాకుండా రూపొందించేటప్పుడు జాగ్రత్తలను కూడా తీసుకొని ,ఆ దేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా గుర్తుకు వచ్చేలా అలా ఆ జెండా లో పొందు పరుస్తూ ఉంటారు . అంతే కాదు జాతీయ జెండా రంగులు కూడా వివిధ రకాల ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.


ఇకపోతే బ్రిటిష్ పరిపాలన నుంచి ఎన్నో సంవత్సరాల  సుదీర్ఘ పోరాటంలో చివరికి తమ తమ దేశాలను రక్షించుకున్నారు. మన భారతదేశం తో పాటు మరో 4 దేశాలు కూడా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం గా ప్రకటించుకోవడం జరిగింది. ఇకపోతే ఏ ఏ దేశాలు మన దేశం లాగే స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీన జరుపుకోబోతున్నాయి.. ఆ దేశాలలో  అత్యంత పవిత్రంగా భావించే జాతీయ జెండాలను ఎవరూ  రూపొందించారు.. ఆ విశేషాలు ఏమిటి..? అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1. భారతదేశం:
స్వేచ్ఛ దేశానికి చిహ్నమే జాతీయ జెండా. ముఖ్యంగా భారతదేశంలో మువ్వన్నెల జెండాగా పిలువబడుతున్న ఈ జాతీయ జెండా మూడు రంగులు కూడా వివిధ దేశాలు జాతీయ పతాకంలో కూడా రూపొందించబడ్డాయి. ముఖ్యంగా ఈ జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. దీని పొడవు అలాగే వెడల్పుల నిష్పత్తి 2:3. ఈ జాతీయ జెండా లో మొదట పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు సమాన నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్య భాగంలో  నీలి రంగులో 24 స్తంబాలు కలిగిన అశోకుడి ధర్మచక్రం రూపొందించబడింది. భారతదేశంలో ఈ జాతీయ జెండాను కర్ణాటక లోని దార్వాడాలో మాత్రమే తయారు చేయడానికి అనుమతులను జారీ చేశారు. కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం అనే సంస్థ వారు ఈ జాతీయ జెండాలను తయారు చేయడానికి అలాగే సప్లై చేయడానికి అనుమతి పొందారు. ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కేవలం ఖాదీ కాటన్ ను ఉపయోగించి , చేతితో మాత్రమే ఈ  జెండాను రూపొందించేవారు.ఇక ఈ ప్రదేశంలో తప్ప మరి ఇక్కడ జాతీయ జెండాను తయారు చేయడానికి అనుమతి ఇవ్వడం లేదు.

2. ఉత్తర కొరియా :
ఉత్తర కొరియా దేశస్తులు కూడా 1945 ఆగస్టు 15వ తేదీన వారి దేశ స్వాతంత్ర దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక ఈ జాతీయ జెండాను కిమ్ ఇల్ సంగ్ రూపొందించారు. ఇక ఈ జెండా యొక్క పొడవు అలాగే వెడల్పుల నిష్పత్తి 1:2. ఈ జెండా మధ్యలో ఒక విస్తృత ఎరుపు గీత, పైన కింద తెల్లని బార్డర్ లతో ఉంటుంది. ఆ తర్వాత తెలుగు గీత పైన, తెలుగు గీత కింద నీలం రంగు ఉంటుంది. మధ్యలో తెల్లటి సర్కిల్ లోపల ఒక ఎర్రటి  నక్షత్రం కూడా ఉండడం గమనించవచ్చు.

3. దక్షిణ కొరియా:
దక్షిణ కొరియా జాతీయ జెండాను పార్క్ యియోంగ్ హయో రూపొందించడం జరిగింది. ఇక ఈ జాతీయ జెండాను మనం చూసినట్లయితే మధ్యలో ఒక సర్కిల్ లో ఎరుపు అలాగే నీలం రంగులు గమనించవచ్చు.ఈ
వృత్తానికి నాలుగు వైపుల ఉన్న గీతల ఆధారంగా వాటి ప్రాముఖ్యత ఏమిటంటే, వృత్తానికి పైన ఎడమ భాగంలో ఉన్న గుర్తు  న్యాయం, మానవత్వానికి ప్రతిరూపం. అదే పైన కుడి భాగంలో నీరు, జ్ఞానం ,మేధస్సుకు ప్రతిరూపం. వృత్తానికి కింద ఎడమ భాగంలో ఉన్న గుర్తు అగ్ని, యోగ సూత్ర ధర్మానికి ప్రతీక అయితే, వృత్తానికి కింద కుడి భాగంలో ఉన్న గుర్తులు ఆశ , శాంతి అలాగే స్వచ్ఛతకు ప్రతిరూపం. వీరు కూడా 1975 ఆగస్టు 15వ తేదీన తమ దేశ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.

4. బహ్రెయిన్ :
బహ్రెయిన్ దేశం కూడా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం గా జరుపుకుంటుంది. ఇక ఈ దేశపు జాతీయ జెండా ని ఎలా గుర్తించాలి అంటే, జెండాకు ఎగువ భాగంలో  తెల్లని ప్రదేశం లావుండి, ఒక పెద్ద ఎర్రటి క్షేత్రం నుండి 5 తెల్ల త్రిభుజాలతో  కలిసిన జిగ్‌జాగ్ లాగా వేరు చేయబడి ఉంటుంది. జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 3:5. ఈ దేశం వారు కూడా ఆగస్టు 15వ తేదీని తమ స్వాతంత్ర దినోత్సవం గా ప్రకటించుకున్నారు.

5.లీచెన్‌స్టెయిన్ :
లీచెన్‌స్టెయిన్ అక్టోబర్ 1921 వ  రాజ్యాంగంలో ఈ జెండాకు అధికారిక హోదా ఇవ్వబడింది.ఈ జెండా నీలి అలాగే ఎరుపు నమూనాలను  కలిగి ఉంది. ఈ జెండా  ఎగువ మూలలో ఉన్న పసుపు కిరీటంతో అడ్డంగా విభజించబడిన నీలం , ఎరుపు జాతీయ జెండా. ఈ జెండా వెడల్పు అలాగే పొడవు నిష్పత్తి 3:5 వరకు ఉంటుంది. ఈ దేశం కూడా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం గా జరుపుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: