ప్రస్తుతం ఒక పెళ్ళిలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమి జరిగినదంటే పెళ్ళికి వచ్చిన పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ సరదగా అందరినీ ఆటపట్టిస్తూ జోకులు, కామెంట్స్ చేసుకుంటున్నారు. కానీ ఆ అల్లరి కాస్తా ఎక్కువైంది. అయితే వీటన్నటినీ వింటున్న పెళ్లి కొడుకు ఓపికగా ఉన్నాడు. అయినా వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఇద్దరూ పెళ్లి పీటలపై కూర్చున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో దండ వేశాడు. అయితే ఇప్పుడు పెళ్లి కూతురు తన మేడలో దండ వెయ్యాలి. ఆ సమయంలోనే ఫ్రెండ్స్ మళ్ళీ అల్లరి మొదలెట్టారు. ఈ సారి పెళ్లి కూతురిని ఉద్దేశించి ఏవేవో మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు. ఇక ఆమె భరించలేకపోయింది. ఒక్కసారిగా కాళీ మాత లాగా ఆగ్రహంతో ఊగిపోయింది. నాకు ఈ పెళ్లి వద్దు అనే అంతా పేస్ ఫీలింగ్ పెట్టి ఆవేశంగా వారి వంక చూసింది. ఆ తర్వాత ఈ వెదవలు గ్రూప్ మారేలా లేరు అనుకుని మళ్ళీ పెళ్లి కొడుకు మేడలో దండ వేసింది.
ఇంత కోపంగా ఉన్న వీడియోను నిరంజన్ అనే వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పోస్ట్ చేశాడు. ఇది బాగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో పెళ్ళికి వచ్చామా చూశామా వెళ్ళామా అని కాకుండా మీకెందుకురా అత్తిపనులు అని ఫ్రెండ్స్ ని తిట్టిపోస్తున్నారు. మరి కొందరు ఏదైతే ఏమి పెళ్లి జరిగిందిగా సంతోషం అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియో 1.6 లక్షల వ్యూయర్స్ ను సంపాదించుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి