దీపావళి పండుగ అంటేనే రకరకాల కళ్ళు వెదజల్లే రంగులతో టపాసులు, ఢాం ఢాం అంటూ శబ్దం వచ్చే టపాకాయలు పేల్చనిదే , ఆ రోజు దీపావళి పండుగ పూర్తవదు.. అందుకే దీపావళి పండుగకు ఈ టపాకాయలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో పర్యావరణాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.. అందుకే చాలా రాష్ట్రాలు ఈ దీపావళి పండుగ రోజు పటాకులు కాల్చడానికి నిషేధం విధించాయి. ప్రభుత్వాలు నిషేధాలు విధించినా, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మిరుమెట్లు గొలిపే టపాసులను పేల్చవచ్చని మీకు తెలుసా..? అది కూడా కేవలం రిమోట్ సహాయంతో టపాకాయలను పేల్చ వచ్చు.. ఆశ్చర్యపోతున్నారా..? అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ యుగంలో ఏదీ అసాధ్యం కాదని గుర్తించుకోవాలి.


అవే ఎలక్ట్రానిక్ ఫైర్ క్రాకర్స్.. వీటిని ఈ - క్రాకర్స్ అని కూడా పిలుస్తారు. ఇక వీటి పనితీరు విషయానికి వస్తే..ఈ-క్రాకర్స్‌ లోపలా చిన్న పాడ్స్‌ ఉంటాయి. ఇవి ఒకదానికొకటి వైర్లతో అనుసంధానం చేయబడి ఉంటాయి. వీటికి ఎల్‌ఈడీ బల్బులు అమర్చింటారు. ఎప్పుడైతే ఈ-క్రాకర్స్‌ను మనం ప్లగ్‌కు అనుసంధానించి స్టార్ట్‌ చేస్తామో.. అప్పుడు నిజమైన టపాసులు వెదజల్లే వెలుగులను ఈ ఎల్‌ఈడీ బల్బులు ప్రసరింప జేస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎల్ఈడీ బల్బులు  రిమోట్‌తో అనుసంధానమై ఉండటం వల్ల భిన్నమైన రంగులు, సౌండ్లను  , డిజైన్ లను మనం ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వీటిని ఎక్కువగా వేడుకలు, సినీ కార్యక్రమాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.


ఈ- క్రాకర్స్ వల్ల ఎటువంటి పర్యావరణ ప్రమాదం ఉండదు.. పైగా మెరుగులు, నిప్పురవ్వలు పడతాయన్న భయము ఉండదు.. ఆహ్లాదకరమైన శబ్దాలు, రంగులను మనం ఈ - క్రాకర్స్ ద్వారా చూడవచ్చు. ఇక వీటి ధర విషయానికి వస్తే ,మార్కెట్లో ఒక్కో ఈ - క్రాకర్ ధర 2, 500 రూపాయలు.. ఒకసారి కొనుగోలు చేస్తే మూడు సంవత్సరాల పాటు వీటిని ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: