ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి. కొన్ని జంటలు ప్రేమలో ఉన్నట్లు ఇద్దరికీ తెలిసినప్పటికీ ఒకరిని ఒకరు ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రంసరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనసుకు నచ్చిన  వ్యక్తికి ప్రేమను వ్యక్తపరిచి కలకాలం తమ ప్రేమను పదిలం చేసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. అయితే అందరిలా కాకుండా ప్రేయసికి కాస్త కొత్తగా ప్రపోస్ చేయాలని నేటి రోజుల్లో ఎంతోమంది యువకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కొంతమంది క్రికెట్ ప్రేక్షకులను ఏకంగా క్రికెట్ స్టేడియం లోనే ప్రేయసికి ప్రపోజ్ చేసిచేస్తూ ఉన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇలా ఇటీవలి కాలంలో ఎంతోమంది క్రికెట్ స్టేడియమే తమ ప్రేమను వ్యక్తపరచడానికి అనువైన ప్రదేశంగా భావిస్తూ ప్రపోజ్ చేస్తూ సర్ప్రైస్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో యాషెష్ వంటి ప్రతిష్ఠాత్మక సిరీస్ జరుగుతుంది. మొదటి టెస్ట్ గబ్బ స్టేడియంలో జరుగుతుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగిపోతున్న సమయంలో ఒక యువకుడు మోకాళ్ళపై కూర్చుని గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేశాడు. ఇలా యువకుడు తన ప్రేయసికి ప్రపోస్ చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న వారందరూ అతన్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు.. ప్రపోజల్ తో ఆశ్చర్యపోయిన యువతి వెంటనే అతనికి ఎస్ చెప్పింది.


 రాబ్ అనే వ్యక్తి ఇలా ప్రపోజ్ చేశాడు. గ్రూప్లోజేబులో ఉన్న ఉంగరాన్ని తీసి విల్ యు మ్యారి మీ అంటూ ప్రపోజ్ చేయడం తో ముందుగా ఆశ్చర్యపోయింది యువతి నాట్. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకుని ఓకే అంటూ చెప్పేసింది. దీంతో ఇద్దరూ ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ముద్దల్లో మునిగిపోయింది ఈ ప్రేమ జంట.  పక్కన ఉన్న ప్రేక్షకులు కూడా ప్రేమ జంటకు అల్ ది బెస్ట్ చెబుతూ ఆశీర్వదించారు. అక్కడున్న వారందరూ ఇక ఇదంతా సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: