భార‌త‌దేశం ఒక‌ప్ప‌డు ఎంతో సాంప్ర‌దాయ దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇండియాలో సంప్ర‌దాయాన్ని ప‌క్క‌న పెట్టి పారెన్ కంట్రీస్ క‌ల్చ‌ర్‌ను ఫాలో అవుతున్నారు. ఒక‌ప్పుడు భార‌త్‌లో పెండ్లిళ్ల త‌రువాత హ‌నిమూన్ ట్రిప్ అనేది అస‌లు ఉండేదే కాదు. కానీ ఇప్పుడు ప‌ల్లెల నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు పెళ్లి అయిన జంట‌లు హ‌నీమూన్ వెకెష‌న్ అంటూ ఫారిన్ కంట్రీల‌కు వెళ్ల‌డం ఆన‌వాయితీగా మారిపోయింది.

విదేశాల్లో మాత్రం స‌ర్వ‌సాధార‌ణం ఇది అక్క‌డ  పురాత‌న కాలం నుంచి ఉన్న క‌ల్చ‌ర్‌. నిజానికి హ‌నీమూన్‌లో నూత‌న జంట ఏకాంతంగా ఉండ‌ట‌మే కాదు.. ఒక‌రినొక‌రూ అర్థం చేసుకోవ‌డం కూడా ఉంటుంటుంది. అయితే తాజాజా ఓ విచిత్ర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆ జంట మ‌ధ్య చోటు చేసుకున్న ప‌రిణామం ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఓ వ్య‌క్తి త‌న భార్య‌తో క‌లిసి హ‌నీమూన్ ట్రిప్ ప్లాన్ చేసాడు. కానీ అందులో ఓ చిన్న ట్విస్ట్ ఉన్న‌ది. అది విన్న త‌రువాత ఆ భార్య‌కు ఫ్యూజులు ఔటయ్యాయి.

త‌న పెండ్లికి ఇంకా 7 నెల‌ల స‌మ‌యం ఉంద‌న‌గా.. ఓ వ్య‌క్తి త‌న‌కు కాబోయే భార్య‌తో హ‌నీమూన్‌కు ఎక్క‌డికీ వెల్లారో ఆలోచించ‌డం మొద‌లెట్టాడు. వారిద్ద‌రూ ప‌లుమార్లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డిన త‌రువాత ఓ మంచి ప్ర‌దేశాన్ని త‌మ హ‌నీమూన్ స్పాట్‌గా ఎంచుకున్నారు. అయితే పెళ్లి కాగానే అక్క‌డికి వెళ్లాల‌ని నిశ్చ‌యించుకుంది ఆ జంట‌. ఇంత వ‌ర‌కు బాగానే  ఉన్నా ఇక త‌రువాత క‌థ‌లో అస‌లు ట్విస్ట్ వ‌చ్చిన‌ది. ఆ వ్య‌క్తి త‌మ హ‌నీమూన్ ట్రిప్ గురించి త‌న స్నేహితుల‌తో షేర్ చేసుకున్నాడు.

వాళ్లు కూడా ఎప్ప‌టి నుంచో ఆ చోటుకు వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టుగా చెప్పుకొచ్చారు. అక్కిడికీ వెళ్లేందుకు వారికి ఛాన్స్ దొర‌క‌క‌పోడంతో.. ఇప్పుడు నీతో క‌లిసి వెళ్లితే మ‌నం బాగా ఎంజాయ్ చేయ‌వచ్చు అని స్నేహితులు అత‌నికి చెప్ప‌గా.. స్నేహితుల కోరిక‌ను కాద‌న‌లేక‌పోయాడు. అయితే ఈ విష‌యాన్ని త‌న‌కు కాబోయే భార్య‌కు చెప్ప‌డంతో ఇంకేముంది ఆమె ఆగ్ర‌హంతో.. ఇడియ‌ట్ అని.. ఆ ఆలోచ‌న వ‌చ్చినందుకు తిట్ట‌ని తిట్లు తిట్టేసింది. అయినా ఆ వ్య‌క్తి ఆమెను ఒప్పించ‌డానికి ఎంత‌గానో ప్ర‌య‌త్నం చేసాడు. కానీ చివ‌రికీ ఆమె ఒప్పుకోక‌పోవ‌డం ఆప్లాన్ కుద‌ర‌లేదు. ఈ ఘ‌ట‌న రెడ్డిట్ ద్వారా ఆ వ్య‌క్తి నెటిజ‌న్ల‌కు పంచుకోవ‌డంతో.. అత‌న్ని ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు నెటిజ‌న్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: