రోడ్డు ప్రమాదాలను తగ్గించే పనిలో పోలీసులు ఉన్నారు. అందుకోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా స్టైల్ ను ఫాలో అవుతున్నారు. ఇటీవల విడుదల అయిన కొత్త సినిమాల లోని కొన్ని పంచ్ డైలాగులు, వీడియోలను, లేదా పోస్టర్లను ఆధారంగా చేసుకొని కొన్ని మెసేజ్ లను  అందిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.. వాటికి యువత బాగా ఆకర్షితులు అవుతున్నారు. తాజాగా మరో సినిమాను పోలీసులు వాడుకున్నారు. ఆ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.


స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం పుష్ప.. డిసెంబర్‌17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కాగా, ఈ సినిమాలలొ డైలాగులు, పాటలు అన్నీ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా లోని, పాటలను, డైలాగ్స్ ను సాదారణ ప్రజల నుంచి స్టార్ హీరో వరకూ అందరూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా వినూత్న ఆలోచన చేసారు. గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించిన పోలీసులు ఇప్పుడు పుష్ప మూవీ తో మరోసారి ప్రమాదాలను తగ్గించె ప్రయత్నం చేశారు. అది సోషల్ మీడియాలో రచ్చ చెస్తుంది.ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలని చెబుతూ పుష్ప సినిమాలో బైక్‌పై వెళుతున్న బన్నీ ఫొటోకు హెల్మెట్‌ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు. హెల్మెట్ విషయం లో వెనక్కి తగ్గేదెలే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఈ పోస్టర్ పై అల్లు అర్జున్ కూడా తన స్తైయిల్లో స్పందించారు. మీరు కూడా ఒకసారి చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి: