తీరని కోరికలతో చనిపోయినవారికి గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయా..? అవన్నీ కేవలం సినిమాలోనే జరుగుతాయని సమాధానం ఇచ్చే వాళ్లే ఎక్కువ. కానీ కొన్ని ఘటనలు మాత్రం వారి అభిప్రాయాలను మార్చేస్తాయి. అలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలిక తన పూర్వ జన్మ కు సంబంధించిన వివరాలు చకచకా చెప్పేస్తోంది. తాను మళ్ళీ పుట్టానంటున్న కింజల్. ఈమెది రాజస్థాన్ లోని పారావల్ అనే గ్రామం. రతన్ సింగ్, చుందావత్ ఐదుగురు కుమార్తెల్లో ఒకరే ఈ చిన్నారి కింజల్. ఈ పాప ఏడాది క్రితం నుంచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. గత జన్మకు సంబంధించిన వివరాలు అడగడం తల్లిదండ్రులకు వింతగా అనిపించేది. పూర్వజన్మలో తన సోదరుడు, తల్లితండ్రులు గురించి పదేపదే అడిగేది. గత జన్మలో తన పేరు ఉషా అని, 2013 లో ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయి మరణించానని చెప్పేది. తన ఊరు తో సహా తన పిల్లల పేర్లు తడబాటు లేకుండా చెప్పేది. మొదట్లో చిన్న పిల్ల ఏదో తెలిసీ తెలియక మాట్లాడుతుందిలే అని అనుకున్నారు.

కానీ ఓసారి డాక్టర్ కు చూపించారు.అయితే ఆ చిన్నారికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. అయినా కింజల్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో,ఆమె చెప్పిన దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలని  ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో అంతా నివ్వెరపోయే వాస్తవం బయటకొచ్చింది. కింజల్ చెప్పినదాని ప్రకారం తాను గత జన్మ లో ఉన్న ఊరు పారావాల్ కి 30 కి.మీ. దూరంలో ఉంది. దీంతో ఆ బాలికను వెంటబెట్టుకుని ఆమె చెబుతున్న పిప్లాత్రి గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎంక్వైరీ చేశారు. అంతా ఆశ్చర్యపోయేలా కింజల్ తన గత జన్మ తల్లిదండ్రులను గుర్తించింది. ఉషా తల్లి దుర్గా దేవిని చూసిన కింజల్ బోరున ఏడ్చేసింది. సోదరుడు పంకజ్ ను చూసి చాలా సంతోషపడింది. వారందరినీ గుర్తు పట్టడమే కాదు చిన్ననాటి సంఘటనలు ఒక్కొక్కటిగా చెప్పేసింది. 2013లో గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిన ఘటనను పూస గుచ్చినట్లు అందరికీ వివరించింది.ఇదంతా చూసినవాళ్లు ఆమె మళ్లీ పుట్టిందని పూర్తిగా నమ్మారు. ఇప్పుడు ఇద్దరి కుటుంబాలకు కింజల్ దగ్గరైంది. ఇరు కుటుంబాలు ఆమె మాటలను పూర్తిగా నమ్మరు.వారి మధ్య బంధుత్వం ఏర్పడింది.ప్రస్తుతం కింజల్ ఈ జన్మ తల్లితండ్రుల వద్దే వుంటున్నా, గత జన్మ తల్లిదండ్రులు కింజల్ తో రోజు ఫోన్ లో మాట్లాడుతారు. నాలుగేళ్ల చిన్నారి తనకంటే వయసులో పదేళ్ళైనా పెద్దవారికి జాగ్రత్తలు చెబుతూ, వారి క్షేమ సమాచారం తెలుసుకుంటుంది. ఈ వార్త రాజస్థాన్ అంతా హాట్ టాపిక్ గా మారింది.

ఇలాంటి ఘటనలు కొత్తవేమీ కావు. ఇలా తమకు పునర్జన్మ గుర్తొచ్చింది అని చెప్పిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కొందరు సైన్స్ లో ఇలాంటి వాటికి చోటులేదని చెబితే, మరి కొందరు మాత్రం ఇది ముమ్మాటికీ జరుగుతాయని బలంగా నమ్ముతారు. పునర్జన్మ నమ్మకాలను బలపరిచేలా కొన్ని ఘటనలు జరిగాయి. అలాంటి వాటిలో ఒకటి పొల్లాక్ సిస్టర్స్ కథ. ఇది మన సైన్స్ కే అందని అద్భుతం. శాంతి దేవి పునర్జన్మ కథ కూడా  ఇలాగే అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక చిన్న బాలిక తన పూర్వజన్మ గురించి బతికున్న భర్త,పిల్లల గురించి చెప్తుంటే అంతా షాక్ అయ్యారు. ఆ జాబితాలో మహాత్మాగాంధీ కూడా ఉన్నారు. ఆయనే స్వయంగా ఈ విషయంలో విచారణ కోసం ఓ కమీషన్ వేశారు. అదిచ్చిన నివేదిక చూసి ఆశ్చర్యపోయారు. చివరకు ఆమె చెప్పిందంతా నిజమే అని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: