అత్తా- కోడళ్లు అనగానే.. వెంటనే వారి మధ్య గొడవలే గుర్తుకొస్తాయి.  ప్ర‌స్తుతం ఉన్న  యువతులు చాలామంది అత్త, మామలతో కలిసి ఉండేందుకు నిరాకరిస్తున్నారు. పెళ్లి జ‌రిగిన వెంట‌నే వేర్వేరు కాపురాలు పెట్టేస్తున్నారు. రియాల్టీని ఇంకొంచెం డ్రమిటైజ్ చేసి టీవీ సిరియల్స్ ల‌లో అత్తా-కోడళ్లను బద్దశత్రువులుగా  చూపిస్తున్నారు. ఇక పెళ్లి జ‌రిగి మెట్టినింట అడుగుపెట్టిన కోడళ్లను కూతుర్ల మాదిరిగా  ట్రీట్ చేసే అత్తలు చాలా అరుదు అనే  చెప్ప‌వ‌చ్చు.

అదేమిటంటే.. తెలియ‌దు  తమ కూతురికి అత్తారింట బాగా జరగాలని కోరుకుంటారు. ఇంట్లో కోడలిని మాత్రం అంత మంచిగా చూసుకోరు. అయితే ఇప్పుడు చెప్పబోయే మహిళ మాత్రం.. కోడలి గురించి చాలా పరిణితితో ఆలోచించిన‌ది. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన‌ది. కొడుకు ఊహించని విధంగా మరణిస్తే.. కోడలిని పుట్టింటికి పంపించకుండా.. కన్న బిడ్డలా చూసుకున్న‌ది. ఉన్నత చదువులు చదివించి.. మంచి ఉద్యోగం వచ్చిన త‌రువ‌త మ‌రొక వివాహం చేసింది. రాజస్థాన్ లోని సికార్ జిల్లా లో ఈ ఘటన వెలుగులోకి వ‌చ్చింది.

అక్కడ నివసించే కమలా దేవి, దిలావర్ దంపతులకు శుభమ్  అనే ఓ కుమారుడు ఉండే వారు. గుణ గణాలు చూసి 2016 మే 25న సునీత అనే అమ్మాయితో తన కుమారుడికి వివామం  జ‌రిపించారు కమల. పెళ్లి తర్వాత శుభం.. డాక్టర్ కోర్సు  పూర్తి చేయ‌డం కోసం కిర్గిస్థాన్కు బ‌యలు దేరి వెళ్లారు. 2016 నవంబర్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అతడు అక్క‌డిక‌క్క‌డే అకస్మాత్తుగా ప్రాణాలను వ‌దిలాడు.  అయితే కుమారుడి మరణం అనంతరం కోడలిని త‌న కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు పంపించ‌కుండా త‌న వ‌ద్ద‌నే ఉంచుకున్న‌ది  కమలా దేవి. తన ఇంట్లోనే ఉంచుకొని.. జీవితంలో ఉన్నతంగా నిలబడేలా ప్రోత్సాహన్ని అందించింది. అత్త సహకారంతో చదువు కొనసాగించిన సునీత.. గ్రేడ్-1 లెక్చరర్ జాబ్ సంపాదించిన‌ది. జీవితంలో తనకాళ్లపై తాను నిలబడేలా విధంగా ఎదిగింది. దీంతో సునీతకు దగ్గరుండి రెండో వివాహం  జ‌రిపించింది కమలా దేవి. ఆ అత్త మంచి మనసు చూసి  ప‌లువురు నెటిజ‌న్లు ఎంతగానే పొగుడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: