ప్రపంచం నలుమూలల నిత్యం ఎన్నో వింతలు విడ్డూరాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఒక విచిత్రం మరియు ఆశ్చర్యకరమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలో ఈ వింత జరిగింది. మాములుగా ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి బస్సు లో వెళుతాడు. అయితే బస్సు లో ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోవాలి అన్నది తెలిసిందే. ఒకవేళ ఎవరైనా టిక్కెట్ లేకుండా బస్సు లో ప్రయాణం చేస్తే వారు జరిమానాతో పాటుగా కొన్ని సార్లు జైలు శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది.

అయితే ఒక వ్యక్తి మాత్రం తనతో పాటుగా తన వెంట తెచ్చుకున్న కోడి పుంజుకు సైతం టికెట్ కొన్న తీరు అందరినీ ఎంతగానో షాక్ కు గురి చేసింది. మహమ్మద్ అనే ఒక వ్యక్తి గోదావరి ఖని నుండి కరీంనగర్ కు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. సరే.. బస్సు లో ఎక్కినా అతన్ని కండక్టర్ టికెట్ తీసుకోమన్నాడు, అతను మారు మాట్లాడకుండా తనకు టికెట్ తీసుకున్నాడు. ఇంతలో తన పక్కనే ఉన్న కోడి పుంజును చూసిన కండక్టర్ దానికి కూడా టికెట్ కొనమన్నాడు. కండక్టర్ అడిగిన దానికి మహమ్మద్ కు మొదట చాలా కోపం వచ్చింది. అయితే బస్ కండక్టర్ మాత్రం ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే అని పట్టుబట్టడంతో ఇక చేసేది ఏమీ లేక టికెట్ తీసుకున్నాడు.

అయితే కోడికి టికెట్ గా రూ. 30 తీసుకోవడం ఆశ్చర్యకరం. కానీ ఆ బసు లో ఉన్న మిగతా ప్రయాణికులు అడిగిన ప్రశ్నకు ఆ కండక్టర్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా... బస్సు లో ప్రాణంతో ఉన్న ఏ జీవి ప్రయాణించినా టికెట్ కొనడం అనేది నియమం అని చెప్పి వాళ్ళ నోరు మూయించాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. ఇక మీదట ఎవ్వరైనా కోళ్లు, బాతులు, పిల్లులను తమతో తీసుకెళ్లాలంటే టికెట్ కొని తీరాల్సిందే. దీనితో ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీకి ఎండీగా ఉన్న ఐపీఎస్ సజ్జనార్ ను ట్రోల్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: