అయితే ఇప్పుడు వరకు ఉత్తర భారత దేశం లో ఏదైనా వేడుక జరిగితే పురుషులు గన్ ఫైరింగ్ చేస్తూ ఉండేవారు. కానీ పురుషులకు మేమేం తక్కువ అనుకుందో ఏమో ఒక మహిళ కూడా ఇటీవలే అబ్బాయిలతో పోటీ పడుతూ తుపాకీ తో గన్ ఫైరింగ్ చేసింది. దీంతో అందరూ కాస్త భయాందోళనకు గురయ్యారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలో జరిగిన ఒక వేడుకలో గన్తో మహిళా హల్ చల్ చేసింది. ఒక్కసారి కాదు ఏకంగా ఆరు సార్లు వివాహ వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరిపింది. మొదట కేవలం ఒకేసారి కాల్పులు జరిపిన ఆ మహిళ ఆ తర్వాత భర్తతో కలిసి మరో ఐదు సార్లు ఫైరింగ్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇలా గన్ కల్చర్ పెరిగిపోవటంపై అటు పోలీసులు మాత్రం సీరియస్ అవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూశామని ఈ వీడియోకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. నిజ నిర్ధారణ అయిన తర్వాత మహిళ పురుషుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి