ఈ క్రమంలోనే ఇక ఇటీవలే ముగిసిన హోలీ పండుగ నేపథ్యంలో ఎన్నో ప్రాంతాలలో అపశ్రుతి చోటు చేసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అంతేకాదు హోలీ సెలబ్రేషన్స్ ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాయి. కాస్త వింతగా హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని ప్రయత్నించడం చివరికి ఎంతోమంది ప్రాణాలు పోయేలా చేసి కుటుంబాల్లో విషాదం నింపింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. హోలీ పండుగ రోజున ఎంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏర్పాటుచేసిన డీజే విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడు కానిస్టేబుల్ మృతి చెందడానికి కారణం అయ్యింది.
బీహార్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా డీజే పెట్టాలి అంటే ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే పోలీసులు అనుమతి లేకుండానే డీజే పెట్టడంతో ఇక పోలీసులు ఈ విషయం తెలుసుకొని రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే అనిరుద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతను అక్కడ చనిపోవడంతో గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులపై దాడికి దిగారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఇక ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోయాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టడంతో వెంటనే స్పందించిన ఎస్పీ రెండు వేల మంది పోలీసులను అక్కడికి తరలించి పరిస్థితులనూ అదుపులోకి తీసుకువచ్చారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి