వివరాల్లొకి వెళితే..రాజస్థాన్‌లో మాయరా అనే ఆచారం చాలా కాలంగా కొనసాగుతోంది. మాయరా ఆచారం ప్రకారం.. వధువు మేనమామ లేదా అమ్మమ్మ కుటుంబసభ్యులు పెళ్లిలో ఖరీదైన కానుకలు తీసుకువస్తారు. ఇటీవల నాగోర్ జిల్లా లాడ్నో గ్రామంలో నలుగురు మేనమామలు కలిసి తమ ఇద్దరు మేనకోడళ్ల వివాహాలకు మాయరా ఆచారం ప్రకారం ఖరీదైన కానుకలను ఇచ్చి వివాహం చేస్తారు.పెళ్ళి కూడా వాళ్ళే చేసి అమ్మాయిని అత్తారింటికి పంపే వరకూ అన్నీ వాళ్ళే చూసుకోవాలి..
విషాయానికొస్తె.. లాడ్నో గ్రామంలోని సీతాదేవి అనే మహిళకు ఇద్దరు కూతుర్లు.. ప్రియాంక, స్వాతి ఉన్నారు. అయితే ఆమెకు అయిదుగురు అన్నలు వున్నారు. వారిలో ఒకరు కాలం చెల్లి చనిపొయారు. తాను చనిపోయిన కూడా మేనకోడల్ల పెళ్ళిని ఘనంగా చేయించాలని మాట ఇచ్చారు. ఆయన కోరిక మేరకు నలుగురు అన్న దమ్ములు కలిసి మేన కోడల్లకు భారీ కానుకలు సమర్పించారు..51 లక్షల నగదు, 25 తులాల బంగారం, ఒక కిలో వెండితో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి.ఈ విధంగా ప్రతీ సంవత్సరం రాజస్థాన్ గ్రామాలలో మాయరా కానుకల గురించి ప్రత్యేక వార్తలొస్తుంటాయి. గత సంవత్సరం కూడా ఒక పెళ్లిలో వధువు మేనమామలు గోనెసంచుల నిండా డబ్బులు తీసుకొని వచ్చి కానుక ఇచ్చారు.ఇలాంటి ఆచారాలను కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆచరిస్తున్నారని సమాచారం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి