దేవుడి చేతిలో మనుషుల జీవితాలు కీలుబొమ్మలు అని అని అంటూ ఉంటారు. కొన్ని ఘటనలు చుసిన తర్వాత ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో  ఊహించని ఘటనలు విషాదం నింపుతూ ఉంటాయ్. రెప్పపాటుకాలంలో చివరికి ప్రాణాలు పోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా భూమ్మీద నూకలు రాసిపెట్టి లేనప్పుడు ప్రమాదం ఎటువైపు నుంచైనా దూసుకు రావచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది నిజమే అని నిరూపించడానికి ఇప్పటివరకు ఎన్నో ఘటనలు ఉదాహరణగా ఉన్నాయి అని చెప్పాలి.



 ఇటీవలే కేరళలో కూడా ఇలాంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది  ఈ వీడియో చూసి జనాలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక బైకర్ జాలీగా ఇక రహదారులపై రయ్యి రయ్యి మంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక వెనకే ఉన్న మరో స్నేహితుడు ఇదంతా వీడియో తీస్తున్నాడు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో వారి ఆనందాన్ని చూసి ఓర్వ లేక పోయింది విధి. ఇక ఘాట్రోడ్లో ఆ యువకుడు వెళ్తున్న సమయంలో ఊహించని విధంగా క్షణ కాల వ్యవధిలోనే ఒక పెద్ద బండరాయి వచ్చి పడింది. అది కూడా సరిగ్గా అతన్ని వచ్చి తాకింది. ఇంకేముంది వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడూ.


 ఇక వీడియో తీసిన వ్యక్తి ఒక్కసారిగా అవాక్కయ్యాడు అనే చెప్పాలి. బండరాయి ఒక్కసారిగా దూసుకువచ్చి మీదపడటంతో బైక్ తో సహా అతను వాగులో పడి పోయాడు.  తీవ్ర గాయాలు కావడంతో చివరికి ప్రాణాలు వదిలాడూ. అతనికి  20 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు గుర్తించారు. అయితే అతన్ని  ఫాలో అవుతు వీడియో తీసిన వ్యక్తి మాట్లాడుతూ ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదని అంటున్నాడు. ఇది చూసిన తర్వాత నేటిజన్లు  కూడా ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: