తండ్రి కూతుర్ల బంధం ఎప్పుడు ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక ఈ బంధం మధ్య ప్రేమానురాగాలు మాటల్లో చెప్పలేని విధం గా ఉంటాయి అని అంటూ ఉంటారు. కానీ ఇటీవలి కాలం లో ఎంతో మంది తండ్రులు తమ కూతుర్ల విషయం లో వ్యవహరిస్తున్న తీరు మాత్రం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తూ ఉంది. అనుక్షణం కంటికి రెప్పలా కూతుర్ని కాపాడుకోవాల్సిన తండ్రి దారుణంగా కూతురు పైన దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయని చెప్పాలి.



 ఇలా రోజు రోజుకు వెలుగు లోకి వస్తున్న ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తూన్నాయి. కూతురికి ఏదైనా సమస్య వచ్చింది అంటే ఆ సమస్యను ముందుండి పరిష్కరించి కూతురికి ఆనందాన్ని పంచాల్సిన తండ్రి ఇక్కడ ఏకంగా కూతురు విషయం లో దారుణం గా వ్యవహరించాడు. ఎనిమిదేళ్ల కూతుర్ని అల్లారు ముద్దుగా చూసుకోవాల్సింది పోయి దారుణం గా హింసించాడు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై దారుణం గా కూతురు పై దాడి చేశాడు ఇక్కడ ఒక కసాయి తండ్రి. ఇలా కూతురి పై తండ్రి దాడి చేసిన ఘటన కు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది అని చెప్పాలి.


 పంజాబ్లోని బటిండా జిల్లాలో రాంపూర్ గ్రామం లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఎనిమిదేళ్ల కూతురు ని దారుణంగా చేయి కర్రలతో కొట్టి మెడ చుట్టూ ఊపిరాడకుండా  టవల్ చుట్టి  శునకానందం పొందాడు కసాయి తండ్రి. అయితే బాలిక ఏడుస్తూ ఊపిరాడక దగ్గుతున్నప్పటికీ అతని మనస్సు మాత్రం కరగలేదు.. చివరికి ఇదంతా చూసి పక్కన ఉన్న వ్యక్తి అక్కడ జరుగుతున్నది ఆపాల్సింది పోయి ఏకంగా కూతురిపై దాడి చేయడానికి ప్రోత్సహించాడు. అంతేకాదు వీడియో కూడా తీశాడు.ఈ ఘటనతో అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: