ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ఎక్కడో అడవుల్లో ఉండే జంతువులను టీవీలో వీక్షిస్తున్నారు అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లు అటు అడవుల్లో ఉండే క్రూర మృగాలు వేట ఆడటం లాంటి వీడియోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక సాధారణంగా యానిమల్ ప్లానెట్ లో సింహాలు, పులులను చూసినప్పుడే ప్రతి ఒక్కరికీ భయం పుడుతు ఉంటుంది. అయ్య బాబోయ్ ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లు అంత ధైర్యంగా ఎలా సింహాలు పులులు దగ్గరగా వెళ్తారు అని అనిపిస్తూ ఉంటుంది.


 అయితే ఇలా టీవీలో సింహాలను చూసి అందరు భయపడుతూ  ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం రెండు భారీ సింహాల ను కంట్రోల్ చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏది అంటే అందరూ సింహం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి సింహం వేటాడాలి అని డిసైడ్ అయితే తప్పించుకోవడం ఇతర జంతువులకు అసాధ్యం అని చెప్పాలి. పెద్ద పెద్ద జంతువులు ని సైతం ఎంతో అలవోకగా వేటాడుతూ ఉంటుంది సింహం.


 అలాంటి సింహాలని అదుపు చేసింది ఇక్కడ మహిళ. ఏకంగా ఆవులు గొర్రెలను కాస్తున్నట్లుగా ఎంతో అలవోకగా సింహాలకు కాపలా కాస్తుంది.  రెండు సింహాలను అదుపు చేస్తూ వాటిని ఎక్కడికో తోలుకు పోతుంది. ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే ఒక మహిళ కర్ర చేతిలో పట్టుకొని అడవి మార్గంలో వెళ్తుంది. అయితే  ఆ మహిళ ముందు ఒక సింహం కనిపిస్తుండగా.. కాసేపటికి మరో సింహం దర్శనమిస్తుంది. ఈ రెండు సింహాలు కూడా వెనుక కర్ర పట్టుకుని వస్తూ ఉంటే ఎంతో సైలెంట్గా ముందుకు వెళుతూ ఉన్నాయి రెండు సింహాలు. ఈ వీడియో చూసిన తర్వాత ఆ మహిళకు అంత ధైర్యం ఎలా వచ్చిందో అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: