సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడు ఎన్నో రకాల వీడియోలు తెర మీదికి వస్తూ   హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. వీడియోలు ఇప్పుడు వరకు చాలానే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కొన్ని వీడియోలు నవ్వులు తెప్పిస్తే.. మరి కొన్ని వీడియోలు మనసును తాకుతూ ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్ అనిచెప్పాలి. ఇటీవల ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఈ వీడియో ప్రతి ఒక్కరిని అవాక్ అయ్యేలా చేస్తుంది.


 చదరంగం పోటీలలో పాల్గొన్న బాలుడు చేతివేళ్ళు చేసి రోబో  విడగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన రష్యా రాజధాని మాస్కోలో చోటు చేసుకుందని తెలుస్తుంది. ఈనెల 19వ తేదీన ఓపెన్ చెస్ పోటీలు జరిగాయి. ఏడేళ్ల క్రిస్టోఫర్ చెస్ రోబో తో పోటీ పడ్డాడు. ఇక ఆటలో మునిగిపోయినా ఆ బాలుడు రోబో కంటే వేగంగా ఒక అనూహ్యమైన ఎత్తు వేస్తాడు. మనుషుల్లాగా ఆ చెస్ రోబో కూడా కుళ్ళుకుందో ఏమో  అనూహ్యంగా స్పందించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్రిస్టఫర్ చూపుడు వేలుని బలంగా నొక్కింది.


 దీంతో అక్కడ జరిగిన ఘటనతో ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక బాధతో విల విల లాడి పోతున్న సదరు బాలుడిని పక్కనే ఉన్న వారు రోబో నుంచి విడిపించేందుకు  ప్రయత్నించారు. అయితే అప్పటికే చేతి వేలికి గాయమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి కట్టు కట్టించారు. ఈ విషయంపై రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు సెర్గి స్పందిస్తూ బాలు చేతికి కట్టు కట్టించినట్లు చెప్పుకోవచ్చాడు.  బాలుడు చెస్ రోబోకు సమయం ఇవ్వకుండా వేగంగా పావులు కదపడం వల్లే  రోబో ఇలా అనూహ్యంగా స్పందించింది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir