ఇటీవలి కాలంలో ప్రపంచం మొత్తం సెల్ఫీ అనే పిచ్చి లో మునిగి తేలుతోంది అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో వినూత్నమైన  టెక్నాలజీ తో కూడిన స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎంతోమంది సెల్ఫీలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రతి క్షణాన్ని సెల్ఫీలో బంధించడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పటికీ కూడా సెల్ఫీలు తీసుకోవడానికి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఒక ఏనుగుల మంద రోడ్డు దాటుతూ ఉంది. ఈ క్రమంలోనే అక్కడ వాహనాలు మొత్తం ఒక్కసారిగా ఆగిపోయాయ్..  ఇలాంటి సమయంలోనే ఒక యువకుడు కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. ఏనుగుల గుంపు వెనక ఉన్న సమయంలో కాస్త దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ ఏనుగుల గుంపు ఒక్కసారిగా వారి మీదికి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించాయ్. అదృష్టవశాత్తు ఆ ఏనుగుల గుంపు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించలేదు అనే చెప్పాలి. కాసేపటి వరకూ వారి మీదికి దూసుకు వచ్చిన ఏనుగుల గుంపు ఆ తర్వాత అక్కడే ఆగి దూరం నుంచి వెళ్లిపోయాయ్.


 ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియోని ఒక ఐఏఎస్ అధికారి ట్విట్టర్ లో షేర్ చేయగా.. వన్యప్రాణులతో సెల్ఫీ పిచ్చి ని చూపించడం చాలా ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చారు. యువకులు చాలా అదృష్టవంతులు ఈ ఏనుగులు వారిని క్షమించి వదిలేశాయి. లేదంటే వారికి గుణపాఠం చెప్పడానికి వాటికి ఎంతో సమయం పట్టేది కాదు అంటూ సదరు ఐఏఎస్ అధికారి రాసుకొచ్చారు. ట్విట్టర్ లో వైరల్ గా  మారిన ఈ వీడియో కాస్త ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: