ఇలాంటి తరహా వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారిపోయాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నో కోళ్లు పాములు వాటి పిల్లలను తినడానికి వచ్చిన సమయంలో వాటితో వీరోచితంగా పోరాటం చేయడం లాంటివి వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ప్రమాదకరమైన నాగుపాములు ఏకంగా ఆరడుగుల మనిషిని కూడా ప్రాణాలు తీసేయగలవు.
ఇక అలాంటి కోబ్రా తో ఇటీవలే తన పిల్లల కోసం ప్రాణాలకు తెగించి పోరాడింది ఇక్కడ ఓ కోడి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఓ యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో అప్లోడ్ చేశారు. పిల్లలతో కలిసి గూటిలో ఉంది కోడి. అంతలోనే అక్కడికి ఒక పెద్ద కోబ్రా వచింది. అయితే ముందుగానే తల్లి కోడి తన పిల్లలను దూరంగా నెట్టేసి కోబ్రా తో తలపడింది. ఇక పిల్లల వైపు కోబ్రా రాకుండా రక్షణ కల్పిస్తూ వచ్చింది. ఈ క్రమంలోని తనని తాను రక్షించుకుంటూ ఒకవైపు పామును పొడుస్తోంది. ఇక కోడి మెరుపువేగంతో దాడి చేయడంతో చివరికి పాము తోక ముడిచింది అని చెప్పాలి. ఇది చూసిన వారు తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.