ఇలా ఏనుగులు కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాయి.. ఎలా దాడికి పాల్పడ్డాయి అన్న దానికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోయాయ్. ఇక ఈ వీడియోను చూసి అందరూ అవాక్కవుతారు అని చెప్పాలి. అయితే సాధారణం గా అడవి ప్రాంతం లో వాహనాలు వెళ్తున్న సమయం లో కొన్నిసార్లు ఏనుగులు వాటి దారిన అవి వెళ్తూ ఉంటాయి. కానీ మరి కొన్ని సార్లు మాత్రం ఏకంగా వాహన దారులపై దాడులకు పాల్పడడం వంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఒక భారీ గజరాజు కు కోపం వచ్చింది. ఈ క్రమం లోనే కారుపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారి పోయింది. ఏకంగా తన భారీ కాళ్లతో కారు ఇంజన్ పై కాలు పెట్టి ధ్వంసం చేసింది అని చెప్పాలి. దీంతో కారు లో ఉన్న వారందరూ ఒక్క సారిగా ప్రాణాలను అర చేతిలో పట్టుకున్నారు. గజరాజు కాస్త పక్కకు తప్పుకున్నట్లు కనిపించ గానే వెంటనే రివర్స్ చేసి వేగంగా వెనక్కి వెళ్లిపోయారు. కారులో ఉన్న వ్యక్తులు కానీ అప్పటికే కారు చాలా ధ్వంసం అయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి