వెరసి ఇటీవల కాలంలో ఎన్నో రాష్ట్రాల్లో వీధి కుక్కల బెడద రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇలా వీధి కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అటు ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాయి అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిని మాత్రమే కాదు ఏకంగా వాహనాలపై వెళ్తున్న వారిని కూడా వెంబడిస్తున్నాయి వీధి కుక్కలు. దీంతో కుక్కలు ఎక్కడ కరుస్తాయో అనే భయంతో వాహనాన్ని వేగంగా నడుపుతూ చివరికి రోడ్డు ప్రమాదం బారిన పడుతున్నారు. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్ వేదికగా మారిపోయింది.
ఒడిశాలో స్కూటర్ పై వెళ్తున్న ఇద్దరు మహిళలతో పాటు మరో చిన్నారిని వెంబడించాయి వీధి కుక్కలు. అయితే ఎక్కడ కుక్కలు కరుస్తాయో అని ఇక వీధి కుక్కల వైపు చూస్తూ ఆ మహిళ స్కూటీ వేగంగా నడిపింది. దీంతో ఒక కారును స్కూటీ బలంగా ఢీకొట్టింది అని చెప్పాలి. దుర్ఘటనలో స్కూటర్ పై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా స్కూటీని వీధి కుక్కలు వెంబడించిన తీరు చూస్తూ ఉంటే ఇక కుక్కలు ఎంత దారుణంగా జనాలను భయపెడుతున్నాయి అన్నది మాత్రం అర్థమవుతుందని ఎంతోమంది నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.