మే 12వ తేదీ ఉదయం వరకు ఈ అల్పపీడనం ఉంటుందని మొదట ఉత్తర వాయువ్యదిశ గా బంగ్లాదేశ్ మయన్మార్ చీరాల వైపు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం బుధవారం తుఫానుగా మారబోతోందని వాతావరణ శాఖ తెలియజేయడం జరుగుతోంది. ఆగ్నేయం వైపుగా బంగాళాఖాతంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగం తో గాలులు వీస్తాయని తెలియజేస్తున్నారు. ఈ అల్పపీడనం వల్ల రానున్న 12 గంటలలో మోచా తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు విస్తాయని తెలియజేస్తున్నారు.
అయితే అండమాన్ నికోబార్ దీవులు నిన్నటి రోజు నుంచి చాలా చోట్ల మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేయడం జరుగుతోంది.. దీంతో పాటుగా తెలుగు రాష్ట్రాలలో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా మృత్యుకారులు వేటకు ఈ సమయంలో వెళ్లకూడదని కూడా తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో అధిక వర్షం కారణంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి