కృష్ణాష్టమి పూజా విధానం విశిష్టత..!!


శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమే కృష్ణుడిలా జన్మించిన పర్వదినాన్ని అందరూ కృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటారు.. శ్రీకృష్ణుడు దేవకి మరియు వసుదేవులకు ఎనిమిదవ సంతానం. అయితే ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఈరోజు 6,7 తేదీలలో జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. మన తెలుగు పంచాంగం లెక్కల ప్రకారం సెప్టెంబర్ 6న ఉదయం 7:57 గంటలకు అష్టమి తిధిప్రారంభం అవుతుందట. ఇక అదే రోజున మధ్యాహ్నం 2:39 గంటలకు రోహిణి నక్షత్రం కూడా రాబోతోందట. అందుకే కృష్ణాష్టమి ఆరవ తేదీన జరుపుకోవాలని పండితుల సైతం తెలుపుతున్నారు.. కానీ వైష్ణవులు మాత్రమే రేపటి రోజున కృష్ణాష్టమి పండుగ జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది.



కృష్ణాష్టమి చేసుకోవాలనుకునేవారు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలను ధరించి ఆ తర్వాత ఇంటిని మరియు తమ పూజగదిని పూజించి తమ ఇంట్లో ఉండే ప్రతి గడప కూడా పసుపు రాసి కుంకుమ పెట్టి ఇంటికి తోరణాలు కట్టాలి.. పూజ గదిలో ముగ్గు వేయడం మరిచిపోకూడదు.. ముఖ్యంగా కన్నయ్యని ఇంటికి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు అడుగులు వేస్తారు. ఇక ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గోరువెచ్చని నేటితో అభిషేకం చేసి ఆ తర్వాత పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరిస్తూ ఉంచాలి.


ఇక కృష్ణుడుకు తులసి దళాలు అంటే చాలా ఇష్టం అందుచేతన తులసిమాలని మెడలో వేయాలి.. కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి పూజ చేస్తే పారిజాత పుష్పాలను ఉపయోగిస్తే చాలా మంచిదట . ఆ తర్వాత కృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి లాలి పాట పాడుతూ పూజ చేయాలి.. కృష్ణాష్టమి రోజున గీత పట్టణం చేస్తే చాలా మంచిదని పండితులు సైతం తెలియజేస్తున్నారు.


కృష్ణాష్టమి రోజున ఒక పూట ఉపవాసం చేస్తే చాలా మంచిదట.

కృష్ణాష్టమి రోజున కృష్ణుడు దేవాలయాలను పూజ చేయించడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా కృష్ణునికి పూజలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి.


సంతానం లేని వారు వివాహం కాని వారు కృష్ణాష్టమి పండుగ రోజున కృష్ణుడి గోపాల మంత్రంతో పూజించడం వల్ల మంచి జరుగుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: