ప్రపంచంలో ఎక్కడో మారుమూలన జరిగిన విషయాలను సైతం ఇట్టే తెలుసుకోగలుగుతున్నాము అంటే దానికి కారణం ఇంటర్నెట్ అనే చెప్పాలి. అయితే నేటి రోజుల్లో జనాలు సోషల్ మీడియా అనే మాయలో మునిగి తేలుతూ ప్రతి రోజు కూడా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోలకు మంచి పాపులారిటీ వస్తూ ఉంటుంది.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాదరణంగా బిల్డింగ్ పైనుంచి ఒక అంతస్తు నుంచి కింద పడితేనే ప్రాణాలతో ఉంటామా లేమా అని చెప్పడం చాలా కష్టం. కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు ఇలా ఒక అంతస్తు నుంచి కింద పడిన కూడా తీవ్ర గాయాల పాలు అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక కుక్క మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అంతస్తుల నుంచి దూకింది. 5 అంతస్తుల పైనుంచి దూకిన తర్వాత ఇంకేముంటుంది ఆ కుక్క ప్రాణాలు అటు నుంచి అటే గాల్లో కలిసి పోతాయని చెబుతారు ఎవరైనా. కానీ ఇక్కడ జరిగింది వేరు.


 ఏకంగా 5 అంతస్తుల నుంచి కిందికి దూకిన కుక్క ఏమి జరగలేదు అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఇక వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే ఒక నల్లటి వీధి కుక్క ఎత్తైన నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్ళింది. అక్కడి నుంచి మెట్లపై నుంచి కిందికి వెళ్లాలి అనుకోలేదు. ఏకంగా భవనం నుంచి కిందికి చూస్తూ చూస్తూ ఒక్కసారిగా దూకేసింది. అయితే కింద దూకిన తర్వాత అక్కడ ఉన్న ఒక కాంపౌండ్ వాల్ కి కూడా తగిలింది. అయినప్పటికీ కుక్క ప్రాణాలతో బయటపడి ఏమి జరగనట్లుగా  అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది చూసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: