సాధారణంగా అటవీ ప్రాంతాలలో ఉండే రహదారుల గుండా వెళుతున్నప్పుడు ఇక అడవిలో ఉండే ఎన్నో జంతువులు తారస పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని జంతువులు ఏకంగా రోడ్డుపైకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా అడవిలో ఉండే జంతువు ఏదైనా రోడ్డుపైకి వచ్చింది అంటే చాలు ఇక వెంటనే వాహనదారులు కారును ఆపివేయడం లాంటివి చేస్తూ ఉంటారు. లేదంటే భయపడిపోయి వేగంగా వాహనాన్ని ముందుకు పోనియడం లాంటిది చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు రాత్రి సమయంలో కూడా ఇలా అడవిలో నుంచి జంతువులు రోడ్డు పైకి వస్తూ ఉంటాయి. దీంతో రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి అని చెప్పాలి. అందుకే జంతు సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఇక అడవి మార్గం గుండా వెళుతున్నప్పుడు జంతువులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండేలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అధికారులు ఎప్పుడూ అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఏకంగా రోడ్డు ప్రమాదంలో ఒక పెద్ద పులి తీవ్రంగా గాయపడింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లా కారిడార్ లో ఒక పులిని కారు ఢీకొట్టింది.. ఈ ఘటనలో పులి తీవ్రంగా గాయపడింది. అంతేకాదు చివరికి ప్రాణాలు కూడా కోల్పోయింది.


 రాత్రి పది గంటల సమయంలో మురర్ధోనిలోని అటవీ ప్రాంతంలో ఒక పెద్ద పులి రోడ్డు దాటుతుంది. ఈ క్రమంలోనే అటువైపు నుంచి వేగంగా దూసుకు వచ్చిన డీసీఎం చివరికి ఆ పెద్దపులిని ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పులి ఇక సత్తువ లేకపోయినా ఆ రోడ్డు దాటి అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ప్రమాదం జరిగిన సమయంలో వెనకాలే మరో వాహనంలో ఉన్న వ్యక్తులు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు ఆ పులిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నించిన.. చివరికి మార్గమధ్యంలోనే ఆ పులి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: