ఈ క్రమంలోనే ఇలా ఎంతోమంది చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదిస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వీడియోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే ఏకంగా తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టుకుని ఇలాంటి విన్యాసాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పుడూ మనం మాట్లాడుకుపోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఇప్పటివరకు ఎంతోమంది బైక్ పై విన్యాసాలు చేయడం చూశాం. కొన్ని విన్యాసాలు చూస్తే వీళ్ళకి పోయేకాలం దగ్గర పడ్డట్టుంది. అందుకే ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది.
అయితే మీరు ఇప్పటివరకు కనీ వీని ఎరుగని రీతిలో ఒక యువకుడు విన్యాసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూశారా.. వామ్మో ఇలా కూడా బైక్ స్టంట్ చేయొచ్చా అనే మాట మీ నోటి నుంచి వస్తుంది. సాధారణంగా ఎవరైనా రెండు టైర్లు ఉన్న బైక్ తో విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కానీ ఇతను మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా.. ఒకటైరు ఉన్న బైక్ పై విన్యాసం చేశాడు. ముందు టైర్ తో పాటు హ్యాండిల్ మొత్తాన్ని తీసేసాడు. మిగతా భాగంతో పాటు కేవలం వెనక టైర్ మాత్రమే ఉన్న బైక్ ను నిలబెట్టడమే కాకుండా విన్యాసం కూడా చేశాడు. ఇది చూసి నేటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు.