సాధారణంగా టీనేజ్ వయస్సులో యువత పక్కదార్లు పడుతుంది. కానీ ఆ యువకుడు అందరిలా జాలీగా తిరుగుతూ సమయం వృధా చేయలేదు. 16 ఏళ్ల వయస్సులో డ్రోన్ టెక్నాలజీ నుండి ప్రేరణ పొంది మానవులను మోసుకెళ్లే డ్రోన్‌ను కనిపెట్టి రికార్డుల్లోకి ఎక్కాడు. అతనే గ్వాలియర్‌లోని సింధియా స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న మేధాన్ష్ త్రివేది. అవును, ఈ విద్యార్థి పొరుగు దేశం చైనా టెక్నాలజీని వాడుతూ దానిని అభివృద్ధి చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇది తయారు చేయడానికి సాంకేతికంగా తన గురువు అయినటువంటి మనోజ్ మిశ్రా సాయం పొందానని చెప్పుకొచ్చాడు.

చైనా డ్రోన్‌లను చూసిన తర్వాత తాను మనుషులను తీసుకుపోయే డ్రోన్‌ను తయారు చేయాలని నిర్ణయించుకొని కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. "MLDT 01" అని పేరు పెట్టబడిన ఈ డ్రోన్ 80 కిలోగ్రాముల బరువున్న వ్యక్తిని ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకెళ్లగలడు. అంతేకాకుండా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణించగలదు. నివేదికల ప్రకారం, సదరు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఆ కుర్రాడికి దాదాపుగా రూ. 3.5 లక్షలు ఖర్చు అయిందని సమాచారం. ఇక ఆ టోటల్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 3 నెలలు సమయం పట్టిందని వినికిడి.



MLDT 01 డ్రోన్ ఫీచర్ల విషయానికొస్తే... 1.8 మీటర్ల పొడవు కలిగి, 3.5 వెడల్పును కలిగి ఉన్నట్టు సమాచారం. సాధారణంగా వ్యవసాయ డ్రోన్‌లలో ఉపయోగించే 4 మోటార్‌ల ద్వారా ఇది శక్తిని పొందుతుంది. 45-హార్స్పవర్ కెపాసిటీతో, ఇది ఆరు నిమిషాల పాటు ఏకధాటిగా ఎగరగలదు. భద్రతా కారణాల దృష్ట్యా, డ్రోన్ ప్రస్తుతం 10 మీటర్ల ఎత్తు వరకు ఎగరడానికి పరిమితం చేసినట్టు తెలుస్తోంది. మున్ముందు, మేధాన్స్ ఈ డ్రోన్‌ను హైబ్రిడ్ మోడల్‌కి అప్‌గ్రేడ్ చేయాలని మరియు జనాలకి అందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆ కుర్రాడు మాట్లాడుతూ... "భవిష్యత్తులో, నేను సాధారణ ప్రజలకు ఉపయోగపడే డ్రోన్‌లను తయారు చేస్తాను, ఇది వస్తువులను తీసుకెళ్లడానికి, ఒక వ్యక్తిని మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి మరియు వ్యవసాయంలో సేవలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది" అని చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: