ఇటీవలే ఉగ్రవాది దాడీ పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది పైగా భారతీయులు మరణించడంతో ఒక్కసారిగా ఈ విషయం విన్న భారతదేశం ప్రజలు ఫైర్ అవుతున్నారు. దీంతో పాక్ కు తగిన బుద్ధి చెప్పాలని అటు ప్రభుత్వంతో పాటు సైన్యం కూడా భావిస్తోంది. అందుకే గత రెండు మూడు రోజుల నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందని విధంగా వార్తలు వినిపించడంతో పాక్ సైన్యం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యేలా చేశారు.అధికారులు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



అయినప్పటికీ కూడా కొంతమేరకు దీటుగా పాక్ అధికారులు  గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ కానీ పాకిస్తాన్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని పలు రకాల వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ లో 22 మంది సైనికులు హతమయ్యారనే విధంగా తెలుస్తోంది. పాకిస్థాన్ లోనే రెబల్ గ్రూప్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నయి. తాజాగా తుర్బత్, డుక్కి ఆర్మీ కాన్వాన్ల పైన అటాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 22 మంది పాకిస్తాన్ సైనికులు కూడా హతమైనట్లుగా తెలుస్తోంది. మరి కొంతమంది గాయాల పాలయ్యారు అన్నట్లుగా సమాచారం.


వీటితోపాటుగా ఆరుగురు బియర్లీ ఫైటర్స్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. మరొక ప్రాంతంలో ఇరువురి వర్గాల మధ్య కూడా తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. కొన్ని పట్టణాల పైన బిఎల్ఎ పట్టు సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పాకిస్తాన్ దేశంలోనే  ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారని విషయం మాత్రం అంత చిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది. అయితే పహాల్గాం కాల్పుల తర్వాత కొలంబో ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కునట్లుగా అనుమానాలు కలుగుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతున్నాయి. శ్రీలంక ఎయిర్లైన్స్ కు చెందిన యు ఎల్ 122 విమానంలో తనిఖీ చేయగా అందులో ఆరుగురు అనుమానితులు గుర్తించినట్లుగా తెలుస్తోంది వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: