
మనకు తెలిసిందే ఎయిర్ ట్రావెల్ చేయాలి అంటే కచ్చితంగా లగేజ్ కి లిమిట్ ఉంటుంది . లగేజ్ ని విమానంలోకి అనుమతించాలి అంటే కచ్చితంగా వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి . లగేజ్ వెయిట్ లిమిట్స్ క్రాస్ చేయకూడదు కానీ చైనాకు చెందిన మహిళ మాత్రం లగేజ్ ని భారీగా సర్దేసుకుంది . అయితే వెయిట్ లిమిట్ క్రాస్ చేయడంతో అక్కడ ఉండే సిబ్బంది ఆమె లగేజ్ విమానంలోకి తీసుకెళ్లాలి అంటే ఎక్స్ట్రా డబ్బులు పే చేయమన్నారు . లేదంటే లగేజ్ ని అలాగే వదిలేసి వెళ్లిపోమన్నారు . కానీ ఈ రెండిటికి ఒప్పుకోలేదు ఆ మహిళ .
అంతేకాదు అధికారులు రిక్వెస్ట్ చేయకపోగా ఫ్లోర్ పై పడి పొర్లాడుతూ కేకలు పెడుతూ నానాహంగామ సృష్టించింది . దీనివల్ల కొద్దిసేపు ఎయిర్ పోర్ట్ లో పెద్ద సీన్ క్రియేట్ అయ్యింది. అయితే ఈమె ఇలాంటి పనులు చేయడం వల్ల అక్కడ ఉండే మిగతా ప్రయాణికులకు కూడా బాగా ఇబ్బంది కలిగింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అధికారులు ఎంత చెప్పినా విననే వినలేదు . "ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారి కి నాకు ఫ్లైట్ కి టైం అయిపోతుంది అలో చేయండి "అంటూ నానా రచ్చ రంబోలా చేసింది . అదనపు చార్జీలు కట్టమన్న కట్టలేను అంటూ చేతులెత్తేసింది . దీనితో అధికారులు చేసేది ఏమీ లేక మహిళను ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేయించి ఆ జాబితాలో ఆమె పేరు తొలగించి ఆమెను మరో ఫ్లైట్లో వెళ్లాలి అని సూచించారు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!
Une Chinoise a piqué une crise de colère à l’aéroport de Milan quand on lui a dit d’alléger ses bagages pic.twitter.com/9S7pRBj4FN
— 75 Secondes 🗞️ (@75secondes) June 11, 2025