సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో చాలా చాలా వైరల్ గా మారింది.  ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేస్తున్నారు . దానికి ముఖ్య కారణం ఇంట్లో గ్యాస్ సిలిండర్ దగ్గర ఆడవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ విధంగా ఉంటాయి అంటూ చెప్పుకొస్తున్నారు . సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది . ఆ వీడియోలో గ్యాస్ సిలిండర్ పేలుతుంది . అయితే గ్యాస్ సిలిండర్ పేలే మూమెంట్లో ఆ మహిళ చేసిన సాహసం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . అందరూ ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు . ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ లీక్ అవడం వల్ల ఇంట్లో భారీ పేలుడు సంభవించింది.  అయితే అదృష్టవ శాతు ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా తప్పించుకున్నారు .

దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఓ మహిళ గ్యాస్ సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీక్ అవుతుంది అని గమనిస్తుంది . వెంటనే అది కిచెన్లో కాకుండా బయటకి తీసుకొస్తుంది . దానిని ఇంటి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది . అది పెద్దగా లీక్ అవుతూ ఉన్న కారణంగా సిలిండర్ నేలపై పడిపోయింది.  ఆ సిలిండర్ ని ఆమె ఎత్తుకోలేక పోతుంది . ఆ సమయంలో గ్యాస్ మరింత వేగంగా లీక్ అవుతూ మంటలు చెలరేగాయి.  కొద్ది క్షణాల్లోనే మరొక వ్యక్తి అక్కడికి వస్తాడు.  ఇద్దరు కలిసి గ్యాస్ పైప్ నబ్ ఆపే ప్రయత్నం చేస్తారు.  అయితే అంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు వంటింట్లో చోటుచేసుకుంది. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడతాయి . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ గా మారింది .

ఆ మహిళ ముందు జాగ్రత్తగా ఇంటి తలుపులు కిటికీలను తెరిచి ఉంచిన కారణంగా గ్యాస్ లీక్ అయి బయటకు వెళ్లిపోయింది అని.. ఒకవేళ ఆమె టెన్షన్లో కంగారులో డోర్ అలాగే వేసి ఉంచిన విండోస్ తెరవకపోయినా గ్యాస్ అనేది లీక్ అయి బయటకు వెళ్లకపోయినా ప్రమాదం తీవ్రస్థాయిలో ఉండేది అని .. ఇది పేలుడు తీవ్రతను ఘననీయంగా తగ్గించింది అని.. ఫుటేజ్ లో కనిపించదగ్గ విధంగా మంటలు వంటగది నుండి పుట్టి ఇల్లు మొత్తం వ్యాపించిన ఇద్దరు సమస్పూర్తితో బయటకు పరిగెత్తడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా కేవలం చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారు అని జనాలు మాట్లాడుతున్నారు .

అంతేకాదు ఈ వీడియో పై నెటిజెన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు .మహిళ సమయస్పూర్తి  వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో నైన గ్యాస్ లీక్ అవుతున్న మూమెంట్లో ఆడవారు కంగారు పడకుండా ఈ విధంగా చేస్తే కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది అని.. కంగారు పడిపోయి అరుస్తూ కేకలు పెడుతూ టెన్షన్లో డోర్స్ అన్ని క్లోజ్ చేసుకున్న ఏమి చేయకుండా అలాగే గ్యాస్ లీక్ అవుతుంది అని గట్టిగ అరిచినా కూడా అది మరింత ప్రమాదం అని కామెంట్స్ పెడుతున్నారు . వీడియోలోని దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయో చూస్తుంటేనే తెలిసిపోతుంది. అంతేకాదు ఈ సంఘటన గ్యాస్ భద్రత పట్ల మానవ జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి రుజువు చేసింది అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: