ఆ భయంకరమైన క్షణంలో మయంక్ వణికిపోలేదు! ఆకస్మికంగా జరిగిన ఆ దాడిలో.. చిరుత అతని వీపుపైకి లంఘించింది. అప్పుడే ఓ అద్భుతం జరిగింది! మయంక్ వీపుపై ఉన్న స్కూల్ బ్యాగ్ రక్షణ కవచంగా పనిచేసింది! చిరుత పంజా బలం ఆ బ్యాగ్‌కు తగిలింది తప్ప, మయంక్‌కు పెద్ద గాయం కాలేదు. స్కూల్ బ్యాగే ఆ బుడ్డోడిని ప్రాణాపాయం నుంచి కాపాడింది! పోరాటం: రాళ్లు విసిరిన చిన్నారులు! .. చిరుత దాడి చేసినా, ఆ బాల వీరుడు మయంక్ ఏమాత్రం భయపడలేదు. స్నేహితుడి సాయంతో కలిసి గట్టిగా అరుస్తూ పోరాటం మొదలుపెట్టాడు. చేతికి దొరికిన రాళ్లను పులిపైకి విసిరారు. ఇద్దరు పిల్లలు చేసిన ఆ ధైర్యవంతమైన ప్రతిఘటన చూసి, చిరుతే కంగుతింది. వారి అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు కూడా సంఘటనా స్థలానికి పరుగెత్తుకు వచ్చారు. జనం రావడం చూసిన ఆ పులి భయపడి... తిరిగి అడవిలోకి పారిపోయింది.
ఈ పోరాటంలో మయంక్ చేతికి చిరుత పంజా గాయం కావడంతో, వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మయంక్ కోలుకుంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వార్త స్థానికంగానే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సాయంత్రం 4 గంటలకే స్కూల్స్ బంద్! .. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. కంచడ్ రెసిడెంట్ ఫారెస్ట్ ఆఫీసర్ స్వప్నిల్ మోహితే ఆదేశాల మేరకు, చిరుతల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలలను సాయంత్రం 4 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, చిరుత కదలికలను ట్రాక్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక 11 ఏళ్ల బాలుడు చూపించిన ధైర్యం... భయంకరమైన చిరుతకు కూడా పాఠం నేర్పింది. ఆ స్కూల్ బ్యాగ్ మాత్రమే కాదు, మయంక్ కువారా సాహసం కూడా ఈ దేశానికి రక్షణ కవచం లాంటిదే! ఆ వీరత్వానికి మనందరం సలాం చేయాల్సిందే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి