మీరు ఒక గోల్ ను పెట్టుకున్నప్పుడు. ఆ గోల్ ‌ను రీచవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు మీ గోల్ పై మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఇతరులతో మీరు మిమ్మల్ని కంపేర్ చేసుకోకూడదు. ఎప్పుడైతే మీరు ఇతరులతో మిమ్మల్ని కంపేర్ చేసుకుంటారో మీ ఫోకస్ మిస్సవుతుంది. గోల్ మరింత దూరమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన కొన్ని నియమాలను పాటిస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు.గోల్ రీచవ్వాలంటే కమిట్మెంట్ అవసరం. అలాగే డెడికేషన్ కూడా ముఖ్యం. ఒక గోల్ కు మీరు కమిట్ అయ్యారంటే ఇక వెనుతిరిగి చూసుకోవాల్సినవసరం ఉండకూడదు. ఒకవేళ గోల్ ను మీరింకా ఐడెంటిఫై చేసుకోకపోతే వెంటనే ఆ పనిలో ఉండండి. మీ గోల్స్ ను నోట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ను ట్రాక్ చేసుకోండి. మీలోని నైపుణ్యాలని డెవెలప్ చేసుకోవటానికి ప్రయత్నించండి.

కొన్నిసార్లు మీ గోల్ ను మీరు చేరుకోవాలంటే ఆ క్రమంలో మీరు చిన్న చిన్న గోల్స్ ను కొన్ని సాధించాల్సి ఉంటుంది. అవన్నీ కలిపితే మీ మెయిన్ గోల్ ను మీరు రీచవగలుగుతారు.కొన్ని సందర్భాల్లో మీకు సపోర్ట్ కూడా అవసరం. పెర్సనల్ గోల్స్ అయినంత మాత్రాన మీరు సపోర్ట్ తీసుకోకుండా వెళ్ళాలి అన్న రూల్ లేదు. ప్రణాళిక పరంగా వ్యూహాల పరంగా ఎక్స్పర్ట్స్ సహాయాన్ని తీసుకోండి. కొన్ని సార్లు గోల్ ను రీచయ్యే ప్రాసెస్ లో అలసిపోయి డీమోటివేట్ అవడం సహజం. అటువంటప్పుడు, మీకు మీరు బూస్ట్ ఇచ్చుకోవాలి. మీరు సక్సెస్ ఐన సందర్భాలను గుర్తుతెచ్చుకోవాలి.  గోల్స్ ను సెట్ చేసుకున్నాక రీచయ్యే ప్రాసెస్ లో మీరు కొన్ని అడుగులు వేశాక మీకు ఇది సరైన దారి కాదేమో అన్న ఆలోచన వస్తే గోల్స్ ను మళ్ళీ అనలైజ్ చేయండి. డెసిషన్ ను మార్చుకోవడానికి వెనకాడకండి.

మొదటి అడుగులోనే సక్సెస్ పలకరించదని తెలుసుకోవాలి. ఫెయిల్యూర్ వస్తే దాన్ని కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. ఫెయిల్యూర్ ను హ్యాండిల్ చేయడం కూడా ఓ కళే. నిజానికి ఫెయిల్ అవడం వలన మీరో కొత్త విషయం కనిపెట్టినవారవుతారు. ఈ ప్రాసెస్ ను ఇలా చేయకూడదు అని తెలుసుకుంటారు. కాబట్టి, పేషన్స్ తో ముందుకు వెళ్ళాలి. ఫెయిల్యూర్ వలన డీలా పడిపోకూడదు.వీటన్నింటినీ మీరు సక్రమంగా పాటిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: