జీవితం అనేది మనకు చాలా నేర్పిస్తుంది. ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పరిసితుల్లో ఏ విధంగా స్టెప్ తీసుకోవాలో ఇలా ప్రతి ఒక్క విషయం జీవితం ఆయా సందర్భాన్ని బట్టి నేర్పిస్తుంది. తెలివైన వారు మాత్రం ఇలా చేసిన పొరపాట్ల ద్వారా గుణపాఠం నేర్చుకుని మళ్ళీ జీవితంలో అదే తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఇలాంటి వారికి జీవితంలో అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. ప్రతికూల పరిస్థితులను కూడా తమకు ఫేవర్ గా మార్చుకోగలుగుతారు. కానీ టెహ్లివైన వారు అని అనుకునే వారు మాత్రం. ఎన్ని సార్లు గుణపాఠం నేర్చుకున్నా పడే పడే అదే తప్పులు చేస్తూ లైఫ్ లో చాలా వెనకబడిపోయి ఉంటారు. వీరికి అనుకూల పరిస్థితులు కూడా ప్రతి కూలంగా మారిపోతాయి. అన్నింటా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

అయితే ఇలాంటి సమయంలో మీలో మీరు కొన్ని కీలక మార్పులను చేసుకోవడం ద్వారా మళ్ళీ విజయాల బాటలో కొనసాగగలరు.

* మీకున్న సమస్యలను లేదా ఇబ్బందులను (వ్యక్తిగతంగా కావొచ్చు లేదా పనిపరంగా కావొచ్చు) లిస్ట్ అవుట్ చేసుకోండి.

* ఆ సమస్యలు లేదా ఇబ్బందులు కలగడానికి గల కారణాల కోసం అన్వేషించండి. ఉదాహరణకు మీ వ్యక్తిగత సమస్య అయితే మీరు కారణమా, లేదా ఇంకెవరైనా కారణమా అనేది తెలుసుకోండి. ఒకవేళ పనికి సంబంధించిన సమస్య అయితే కారణాలు తెలుసుకోండి.

* ఈ ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఏమి చేయాలి అనే దానిపై ఆలోచించండి. వీలైనంత వరకు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మరియు ఎక్కువ ఒత్తిడిని కలిగించకండి.

* మీకున్న సమస్యలను మీ కుటుంబ సభ్యులతో అలాగే మీ సహోద్యోగులతో పంచుకోండి. వారి నుండి సలహాలను పొందండి.

* ఎంతటి జటిలమైన సమస్యను అయినా మీ పాజిటివ్ ఆలోచనాలతో నాశనం చేయవచ్చని గట్టిగా నమ్మండి.

* ఇలా కొద్ది రోజులు చేసిన తరువాత మీ సమస్యలు ఇంకా ఎన్ని ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి బేధాన్ని గమనించండి. మీరు ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని కనుగొని ఉంటారు.

అంతే కానీ సమస్యను చూసి భయపడినా లేదా పారిపోయినా సమస్య తీరిపోదు. కాబట్టి ఎలాంటి ప్రతి కూల పరిస్థితులు
మీకు ఎదురైనా ఎదురొడ్డి నిలవండి. మీ ఆత్మబలం మరియు మనోధైర్యం ముందు అవెంత చిన్న పురుగులు లాంటివి.
 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: